US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
US Tariffs | రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని టాప్-5 దేశాలైన చైనా, భారత్, స్లొవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్‌పై 100 శాతం టారిఫ్‌లు విధించేందుకు ప్రతిపాదించిన బిల్లును సెనేట్‌లో గురువారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఏకంగా 60 మంది సెనేటర్ల (US Senators) మద్దతు లభించడం గమనార్హం.
International | Published On Jul 17, 2026, 3.23 pm IST
US Tariffs | భారత్‌పై మరోసారి సుంకాల మోత (US Tariffs) మోగించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని టాప్-5 దేశాలైన చైనా, భారత్, స్లొవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్‌పై 100 శాతం టారిఫ్‌లు విధించేందుకు ప్రతిపాదించిన బిల్లును సెనేట్‌లో గురువారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఏకంగా 60 మంది సెనేటర్ల (US Senators) మద్దతు లభించడం గమనార్హం.
ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ ఐదు దేశాలపై 100% వరకూ అదనపు సుంకాలు విధించనున్నారు. అయితే ఏ దేశంపై ఎంత శాతం సుంకం విధించాలనే విషయాన్ని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతి 180 రోజులకు ఒకసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఈ తరహా బిల్లులో ఏకంగా 500 శాతం టారిఫ్ ప్రతిపాదించినప్పటికీ తాజా ముసాయిదాలో దాన్ని 100 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విషయంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ (US Senators) కీలక సవరణలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై మొదట ప్రతిపాదించిన గరిష్ట 500 శాతం దిగుమతి సుంకాన్ని 100 శాతానికి తగ్గించింది. అమెరికా జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తలుచుకుంటే ఏ దేశానికైనా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని బిల్లులో చేర్చారు. అయితే సవరించిన ఈ బిల్లులో అమెరికా ద్వంద్వ వైఖరిని అవలంభించింది.
భారత్, చైనాపై 100 శాతం టారిఫ్‌లు అంటున్న అమెరికా.. ఐరోపాదేశాలకు ఈ బిల్లులో గణనీయమైన మినహాయింపులు ఇచ్చింది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉండటం, అలాగే ఆ దిగుమతులను తగ్గించేందుకు సంబంధిత దేశాలు స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిరూపించగలిగితే టారిఫ్‌ల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనాతోపాటూ ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం దేశాలు ఉన్నాయి. అలాగే అంతరిక్ష, అణు రంగాల్లో రష్యాతో అమెరికా జరిపే ప్రాజెక్టులకు కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని ఈ బిల్లు చెబుతోంది.
మరోవైపు భారత్ ఈ విషయంలో తన స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడం తమ ప్రాధమిక లక్ష్యం అని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే ఇంధనం కొనుగోలు చేస్తామని అమెరికాకు తెలియజేసింది.
Also Read..
విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి
జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే
ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు బెయిల్
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన






