త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | 9వ త‌ర‌గ‌తిలో మూడో భాష వ‌ద్దు : సుప్రీంకోర్టు

Supreme Court | 9వ తరగతిలో మూడో భాషను (3rd language) తీసుకురావొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ లేదా రాష్ట్ర బోర్డులైనా సరే.. 10వ తరగతి అనేది బోర్డు పరీక్ష అని పేర్కొంది. దాని కోసం విద్యార్థులకు 8వ తరగతి ముగింపు నుంచే టెన్షన్ మొదలైపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అందువ‌ల్ల‌ 9వ తరగతిలో విద్యార్థుల‌పై కొత్తం భారం వ‌ద్ద‌ని.. ఏవైనా ఉంటే 6వ తరగతిలోనే పెట్టండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

D

National | Published On Jul 16, 2026, 3.09 pm IST

Supreme Court | 9వ త‌ర‌గ‌తిలో మూడో భాష వ‌ద్దు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | 9వ త‌ర‌గ‌తి (Class 9) నుంచే థ‌ర్డ్ లాంగ్వేజ్ (3rd language)ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తీసుకున్ననిర్ణ‌యాన్ని దేశ అత్యున్నత న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల‌ బోర్డు ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న విద్యార్థుల‌పై అద‌న‌పు ఒత్తిడి ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

"తొమ్మిదో త‌ర‌గ‌తిలో మూడో భాష‌ను చేర్చ‌డం చాలా త‌ప్పు. తొమ్మిదో తరగతి అనేది విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం. అప్పుడు కొత్త భాషను ఎందుకు పరిచయం చేయడం..? ఏవైనా కొత్త భాషలు ఉంటే వాటిని ఆరో తరగతి నుంచే నేర్పించడం మొదలుపెట్టాలి కదా..? అప్పుడు విద్యార్థులు ఆ భాష‌ను సుల‌భంగా నేర్చుకోగ‌లుగుతారు" అని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. తమిళనాడులోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల స్థాపనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్‌.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ నాగ‌ర‌త్న‌ తన సొంత స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ.. "మేము మా పాఠశాలలో ఉన్నప్పుడు ఐసీఎస్ఈ, ఎస్ఎస్ఎల్‌సీ రెండూ ఉండేవి. మాకు రెండు సిలబస్‌లనూ బోధించేవారు. 9వ తరగతి చివర్లో మాత్రమే మేము ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చేది" అని తెలిపారు. ఈ మేర‌కు 9వ తరగతిలో మూడో భాషను తీసుకురావొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ లేదా రాష్ట్ర బోర్డులైనా సరే.. 10వ తరగతి అనేది బోర్డు పరీక్ష అని పేర్కొంది. దాని కోసం విద్యార్థులకు 8వ తరగతి ముగింపు నుంచే టెన్షన్ మొదలైపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అందువ‌ల్ల‌ 9వ తరగతిలో విద్యార్థుల‌పై కొత్తం భారం వ‌ద్ద‌ని.. ఏవైనా ఉంటే 6వ తరగతిలోనే పెట్టండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అదే స‌మ‌యంలో జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం మూడో భాషగా హిందీని ఖచ్చితంగా చదవాలనే నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా స్పష్టం చేసింది.

Also Read..

మ‌య‌న్మార్‌ తీరంలో 500 మంది జలసమాధి..!

గోల్కొండ ఆషాఢ బోనాలు ప్రారంభం.. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ స‌జ్జ‌నార్

రేవంత్ తెలంగాణ తడి లేని పొడి మనిషి.. పాలమూరుకు ఆయ‌న‌ ఇచ్చిన బహుమతి మళ్లీ వలసలే

Advertisement
Advertisement