త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

ర‌ఘు కుంచే లీడ్ రోల్‌లో న‌టించిన తెలుగు మూవీ గేదెల రాజు స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం ఒక్క రోజే రెండు ఓటీటీల‌లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

N

News | Published On Jul 17, 2026, 2.47 pm IST

Telugu OTT  | ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Telugu OTT | తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ గేదెల రాజు స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైంది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గేదెల రాజు సినిమాలో ర‌ఘు కుంచే లీడ్ రోల్‌లో న‌టించారు. శ్రీకాంత్ అయ్యంగార్‌, వికాస్‌, టీనా శ్రావ్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే...

ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన గేదేల రాజు సినిమాకు చైత‌న్య మోటూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ర‌ఘు కుంచే మ్యూజిక్ అందించాడు. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించాడు.

రౌడీ షీట‌ర్ క‌థ‌...

గేదెల రాజు కాకినాడ‌లో పేరుమోసిన రౌడీ షీట‌ర్‌. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటాడు. ఎమ్మెల్యే స‌హ‌కారంతో అత‌డికి టికెట్ ల‌భిస్తుంది. టికెట్ కోసం ఆశించిన దుర్గ...గేదెల రాజుతో గొడ‌వ‌ప‌తాడు. అదే రోజు గేదెల రాజు దారుణ హ‌త్య‌కు గుర‌వుతాడు. అత‌డిని చంపింది ఎవ‌రు? ఈ హ‌త్య‌కు రిచ్ (వికాస్‌), స‌త్య (టీనా శ్రావ్య‌)కు ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్‌....

యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ర‌ఘు కుంచే ఆ త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారాడు. బంప‌ర్ ఆఫ‌ర్‌, దేవుడు చేసిన మ‌నుషులు, దొంగాట‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల‌కు సంగీతం అందించాడు. ప‌లాస 1978లో విల‌న్‌గా న‌టించాడు. ఈ సినిమాతో యాక్ట‌ర్‌గా బిజీ అయ్యాడు. ఆప‌రేష‌న్ రావ‌ణ్‌, బాలుగాని టాకీస్‌, దేవ‌గుడితో పాటు ప‌లు చిన్న సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌గా క‌నిపించాడు.

 

Advertisement
Advertisement