త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Education Kit | విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పంద్రాగ‌స్టు లోపు తెలంగాణ ఎడ్యుకేష‌న్ కిట్

Telangana Education Kit | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో చ‌దువుతున్న 27 ల‌క్ష‌ల 50 వేల మంది విద్యార్థుల‌కు 9 వ‌స్తువుల‌తో కూడిన తెలంగాణ ఎడ్యుకేష‌న్ కిట్ పంద్రాగ‌స్టు లోపు ఇవ్వ‌బోతున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jul 15, 2026, 7.09 pm IST

Telangana Education Kit | విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పంద్రాగ‌స్టు లోపు తెలంగాణ ఎడ్యుకేష‌న్ కిట్
Advertisement

Telangana Education Kit | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో చ‌దువుతున్న 27 ల‌క్ష‌ల 50 వేల మంది విద్యార్థుల‌కు 9 వ‌స్తువుల‌తో కూడిన తెలంగాణ ఎడ్యుకేష‌న్ కిట్ పంద్రాగ‌స్టు లోపు ఇవ్వ‌బోతున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. కొత్త‌కోట ప్ర‌భుత్వ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల భ‌వ‌నం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా సీఎం ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

ఒక‌ప్పుడు 29 రాష్ట్రాల్లో విద్యాశాఖ‌కు సంబంధించి కేంద్రం నివేదిక‌లో తెలంగాణ రాష్ట్రం చివ‌ర‌న ఉండే. పోయిన నెల కేంద్రం విడుద‌ల చేసిన నివేదిక‌లో 18వ స్థానానికి ఎదిగాం. ముఖ్య‌మంత్రిగా ఇది నా గొప్ప‌త‌నం కాదు. టీచ‌ర్లంతా క‌ష్ట‌ప‌డి బాధ్య‌త‌గా ప‌ని చేశారు కాబ‌ట్టే రాష్ట్రానికి 18వ స్థానం వ‌చ్చింది. దీంతో టీచ‌ర్లు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకోకూడ‌దు. మొద‌టి రెండు స్థానాల్లో నిల‌బెట్టే వ‌ర‌కు నిరంత‌రం ప‌ని చేయాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు.

పిల్ల‌ల‌కు ఆ భాష‌లు నేర్పించండి..

ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు స్కిల్స్ అవ‌స‌రం ఉన్న‌ది. ఒక‌ప్పుడు కంప్యూట‌ర్, సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంట‌ది అనుకునేవారు. ఇవాళ ఏఐ కార‌ణంగా పిల్ల‌లు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. అందుకే వైట్ కాల‌ర్ జాబ్‌లో పోతుంటే బ్లూ క‌ల‌ర్ జాబ్‌లు అందించాల‌ని సిద్ధంగా ఉన్నాం. అందుకే ఐటీఐల‌ను అప్‌గ్రేడ్ చేశాం. ఈవీ బ్యాట‌రీల‌ను ఎలా చేయాలో నేర్పించేలా శిక్ష‌ణ‌ ఇస్తున్నాం. ఒక‌ప్పుడు అమెరికా వైపు చూసేవాళ్లం. ఇప్పుడు జ‌పాన్, జ‌ర్మ‌నీ, సౌత్ కొరియా, చైనా వైపు చూస్తున్నాం. అక్క‌డ స్కిల్‌తో కూడిన ఉద్యోగాలు ఉన్నాయి. కాబ‌ట్టి పిల్ల‌ల‌కు ఆ భాష‌లు నేర్పించండి. బేసిక్స్ వస్తే నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించుకునే ప‌రిస్థితి ఉందని సీఎం తెలిపారు.

టీచ‌ర్ల‌ను విదేశాల‌కు పంపుతున్నాం..

గ‌తంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్ట‌డీ టూర్ కోసం విదేశాల‌కు వెళ్లేవారు. ఈసారి టీచ‌ర్ల‌ను పంపించి విద్యా వ్య‌వ‌స్థ‌పై అధ్య‌య‌నం చేయించాం. గ‌తేడాది 50 మంది, ఈ ఏడాది 150 మందిని సింగ‌పూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ వంటి దేశాల‌కు పంపుతున్నాం. ఆ దేశాల్లోని విద్యావిధానంపై అధ్య‌య‌నం చేయిస్తున్నాం. ఉత్త‌మ టీచ‌ర్ల అవార్డులు కూడా ఇస్తున్నామ‌ని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement