MLA Sudheer Reddy | జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే
MLA Sudheer Reddy | యువజన సంగ్రామ సభ కోసం గత జూన్ 30న అప్లికేషన్ పెట్టామని జూలై 18 వచ్చినా పర్మిషన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఆరు రకాల కోరికలు ఒక్కొక్కసారి అడిగినప్పటికీ మేం అన్నీ ఇచ్చామని చెప్పారు. రెండు రోజుల నుంచి కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు.
- రెండు రోజులుగా సీపీ ఫోన్ లిఫ్ట్ చేస్తలే
- అయినా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తం
- సరూర్‌నగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
MLA Sudheer Reddy | త్రినేత్ర.న్యూస్: యువజన సంగ్రామ సభ కోసం గత జూన్ 30న అప్లికేషన్ పెట్టామని జూలై 18 వచ్చినా పర్మిషన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఆరు రకాల కోరికలు ఒక్కొక్కసారి అడిగినప్పటికీ మేం అన్నీ ఇచ్చామని చెప్పారు. రెండు రోజుల నుంచి కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఏసీపీతో సీపీకి ఫోన్ చేయించినా అనుమతి ఇవ్వలేదని ఫైరయ్యారు. శుక్రవారం సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పర్మిషన్ ఇవ్వొద్దని చెప్పారట. వేల మంది సభకు వస్తున్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని పర్మిషన్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించారు. నిరుద్యోగులను, ఉద్యోగులను మభ్యపెడుతున్నారు అని దేవిరెడ్డి విమర్శించారు.
కేబినెట్ సమావేశంలో వయోపరిమితిపై నిర్ణయం తీసుకుంటారని.. నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెడితే పోలీసులు అరెస్ట్ చేశారు. చొక్కాలు చింపి వారిని కొట్టారు. విద్యార్థులపై దమనకాండ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు తిరుగుతున్నారు. పోరు బాట పట్టినం.. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేస్తాం అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
సెప్టెంబర్ 22, 2026

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
సెప్టెంబర్ 22, 2026

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



