Karnataka High court | ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు బెయిల్
Karnataka High court | కట్నం కోసం తన బిడ్డను వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుందన్న ఆమె తల్లి వాదనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులు అనేది నమ్మశక్యంగా లేదని కోర్టు పేర్కొంటూ.. నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Karnataka High court | త్రినేత్ర.న్యూస్ : కట్నం కోసం తన బిడ్డను వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుందన్న ఆమె తల్లి వాదనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులు అనేది నమ్మశక్యంగా లేదని కోర్టు పేర్కొంటూ.. నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కర్ణాటకకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాను ప్రేమించిన అమ్మాయిని 2023లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహం ఇరు కుటుంబాల మద్దతుతోనే జరిగింది. వివాహం అనంతరం భార్యాభర్తలిద్దరూ బెంగళూరులో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
వరకట్న వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య
అయితే భార్య ఈ ఏడాది ఆరంభంలో బెంగళూరులోని కిరాయి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తల్లి అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని, ఇందులో అత్తమామల పాత్ర కూడా ఉందని మృతురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.
సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరణ
మొత్తానికి ఈ కేసు కోర్టు మెట్లెక్కింది. కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. సెషన్స్ కోర్టు 2026, ఏప్రిల్ 25న బెయిల్ నిరాకరించింది. దీంతో నిందితుడు కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు.
దంపతులు ఒక్కరే ఉన్నారు తప్ప.. కుటుంబ సభ్యులు ఎవరూ లేరు
జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి.. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ విశ్వజిత్ శెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. చార్జిషీట్ ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ బెంగళూరులోని కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు. ఈ దంపతులు ఒక్కరే ఉన్నారు తప్ప.. అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. పోలీసుల విచారణలో కూడా ఇదే తేలింది. ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు అని విశ్వజిత్ శెట్టి పేర్కొన్నారు. వీరి రెండేళ్ల కుమారుడి బాగోగులు తండ్రే చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఆమె పెదవులపై స్వల్ప గాయాలు
ఇక భార్య ఆత్మహత్యాయత్నం చేసిన వెంటనే భర్త ఆస్పత్రికి తరలించినట్లు కోర్టు తెలిపింది. గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందని కోర్టు పేర్కొంది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమె పెదవులపై స్వల్ప గాయాలైనట్లు మాత్రమే వెల్లడైందన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Suicide | వరకట్నం వేధింపులు.. పెళ్లైన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సెప్టెంబర్ 19, 2026

Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ
సెప్టెంబర్ 15, 2026

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



