Sonam Wangchuk | ఏం జరిగినా.. జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా : సోనమ్ వాంగ్‌చుక్
Sonam Wangchuk | "ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 20 వరకు ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఆత్మగానైనా వస్తా" అని జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న (hunger strike) పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) స్పష్టం చేశారు.
Sonam Wangchuk | నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న (hunger strike) పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. సుదీర్ఘ దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్లిష్ట దశకు చేరుకుందని వైద్యులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ స్పందించారు. జులై 20న నిర్వహించ తలపెట్టిన ‘చలో సంసద్’ (Chalo Sansad) మార్చ్ వరకూ తాను ప్రాణాలతోనే ఉంటానని చెప్పారు. "ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 20 వరకు ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఆత్మగానైనా వస్తా" అని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున కాక్రోచ్‌పార్టీ పార్లమెంట్ మార్చ్ పేరుతో భారీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొనాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. 'చలో సంసద్'లో పాల్గొనాలనుకునే వారు ప్రచార వెబ్‌సైట్ లేదా మిస్డ్ కాల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. "జులై 20న వేలాదిగా తరలి రండి. ఈ సమస్యను ప్రజల తరఫున పార్లమెంట్ ముందుంచుదాం. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ తన బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఉంటుంది" అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
Also Read..
యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన యువకుడు
పార్లమెంట్ ముందుకు వెళ్లే కీలక బిల్లులు ఇవే.. డీలిమిటేషన్‌కు దక్కని చోటు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో
ఆగస్టు 7, 2026

Supreme Court | విద్యార్థి నిరసనకారులపై హింసాత్మక చర్యలొద్దు.. సంయమనం పాటించాలి : సుప్రీంకోర్టు
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ

KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం



