MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
MLC Shambhipur Raju | యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసుకున్నామని గత నెలలోనే మేం కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకున్నామని.. స్పోర్ట్స్ అథారిటీకి కూడా కలెక్టర్ లేఖ రాశారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు డీజీపీ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
- సీపీకి ఫోన్ చేసినా ఎత్తుతలేడు
- పర్మిషన్ ఇవ్వొద్దని సీఎం కార్యాలయం నుంచి సీపీకి ఆదేశాలున్నట్లు తెలిసింది
- మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చాం
- ఇలా పిచ్చి చేష్టలు చేస్తే యువతే సమాధానం చెబుతారు
- సరూర్‌నగర్ స్టేడియం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
MLC Shambhipur Raju | త్రినేత్ర.న్యూస్: యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసుకున్నామని గత నెలలోనే మేం కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకున్నామని.. స్పోర్ట్స్ అథారిటీకి కూడా కలెక్టర్ లేఖ రాశారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. సీపీకి కూడా 8వ తేదీన లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. వాళ్లు అడిగినట్లే అఫీషియల్‌గా డీడీలు కూడా కట్టామన్నారు. పర్మిషన్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీపీకి ఆదేశాలున్నట్లు తెలిసిందని.. అందుకే ఆయనకు ఫోన్ చేసినా ఎత్తడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిన వెంటనే సభలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు డీజీపీ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం సరూర్‌నగర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సీసీ కెమెరాలు పెట్టాలని కూడా పోలీసులు చెప్పారు. ఒక్కొక్క రోజు ఒక దానికి సంబంధించినవి అడిగితే కూడా అధికారులకు ఇచ్చాం. సీపీకి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభ పెట్టుకుంటామన్నా కూడా మేం ఆ రోజు పర్మిషన్ ఇచ్చాం. ఇలా పిచ్చి చేష్టలు చేస్తే యువతే తగిన విధంగా సమాధానం చెబుతారు అని ఎమ్మెల్సీ హెచ్చరించారు.
మేం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తాం అంటే భయం అవుతుందా? నిరుద్యోగులపై ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఢిల్లీకి వెళ్లినా గల్లీకి వెళ్లినా ముఖ్యమంత్రి రాష్ట్ర పరువు తీస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు డీజీపీ పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని హెచ్చరిస్తున్నా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సభ సక్సస్ అవుతుంది. యువత అందరూ తరలి రావాలి అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
సెప్టెంబర్ 20, 2026

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
సెప్టెంబర్ 20, 2026

Bhadradri Kothagudem | ఆడుకుంటూ కారెక్కిన చిన్నారి.. అంతలోనే డోర్ లాక్.. తర్వాత ఏమైందంటే!
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు...పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?
- ●Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
- ●Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ - ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
- ●Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు...పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం

India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల



