Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం
Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో (Sabarimala Temple) ఈ ఏడాది వార్షిక మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరిచారు.
Sabarimala Temple | త్రినేత్ర న్యూస్ : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో (Sabarimala Temple) ఈ ఏడాది వార్షిక మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరిచారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. తొలి రోజు దర్శనం కోసం దాదాపు 30,000 మంది భక్తులు ఇప్పటికే స్లాట్లను బుక్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత మేల్శాంతి ఇ.డి. ప్రసాద్ నంబూద్రి, తంత్రి కందరరు బ్రహ్మదత్తన్ సమక్షంలో గర్భగుడి తలుపులు తెరిచి దీపం వెలిగించారు. అనంతరం పద్దెనిమిది మెట్ల కింద ఉన్న పవిత్ర హోమగుండం (ఆళి) వెలిగించి నూతన మేల్శాంతిలను సన్నిధానానికి ఆహ్వానించారు. తిరువనంతపురానికి చెందిన అరీక్కర సుబ్రమణ్యన్ శంకరన్ నంబూద్రి సాయంత్రం 6:30 గంటల సమయంలో శబరిమల ప్రధాన అర్చకుడిగా (మేల్శాంతి) అభిషేక ప్రక్రియ ద్వారా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోజికోడ్‌లోని వడకర ప్రాంతానికి చెందిన ఎ. దామోదరన్ నంబూద్రి సమీపంలోని మాలికప్పురం దేవి ఆలయ మేల్శాంతిగా బాధ్యతలు చేపడతారు.
రోజుకు 80 వేల మందికే దర్శనం
మండల కాలంలో రోజుకు దాదాపు 80,000 మంది భక్తులకు దర్శనం కల్పించేలా దేవస్వం బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇందులో 60,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, మిగిలిన వారికి స్పాట్ బుకింగ్ కేంద్రాల ద్వారా దర్శన అవకాశం కల్పించనున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజామున 3:00 గంటల నుంచే నూతన మేల్శాంతిలు ఆలయ తలుపులు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పవిత్ర 18 మెట్లపై నిమిషానికి 75 మంది భక్తులను మాత్రమే అనుమతించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించి.. అదే రోజు రాత్రి ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు ఉత్సవాల కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు (మకరజ్యోతి) దర్శనం ఉంటుంది. జనవరి 20న ఆలయం మూసివేతతో ఈ సీజన్ ముగుస్తుంది.
భక్తులకు జీవిత బీమా, ఇంటికే ప్రసాదం..
ఈ సారి భక్తుల సౌకర్యార్థం దేవస్వం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) తొలిసారిగా రూ. 2 లక్షల ఉచిత జీవిత బీమా (Life Insurance) పథకాన్ని ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని దేవస్వం బోర్డు భరించనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు భక్తులకు అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలు ప్రమాద బీమాకే పరిమితం కాగా.. తాజాగా సాధారణ మరణాలకు కూడా బీమా వర్తించేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల యాత్రకు వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తిస్తుంది.
అంతేకాదు, శబరిమలలో కొనుగోలు చేసిన అరవణ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా నేరుగా ఇంటికే తెప్పించుకునే సదుపాయం కల్పించనున్నారు. భక్తులు పోస్టల్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించి, తమ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ప్రసాదాన్ని పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తారు. ఇందుకోసం స్వల్పంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు.
#WATCH | Pathanamthitta, Keralam: Doors of the Sabarimala temple opened today, kicking off the annual Mandala-Makaravilakku pilgrimage season. https://t.co/bPivwx3SQ4
— ANI (@ANI) November 16, 2026
Also Read..
జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం
బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు
భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?
సంబంధిత వార్తలు

Insurance | మకరవిళక్కు వేళ శుభవార్త.. అయ్యప్ప భక్తులకు బీమా కవచం!
నవంబర్ 14, 2026

Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, చర్లపల్లి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు
నవంబర్ 13, 2026

Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం
- ●J&K Encounter | జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం

Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్



