త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | భార‌త్‌ను అవ‌మానిస్తుంటే రేవంత్‌, రాహుల్‌ చ‌ప్ప‌ట్లు కొడ‌త‌రా?

Ramchandar Rao | భార‌త్ స‌మ్మిట్ (Bharath Summit) సంద‌ర్భంగా ఇట‌లీకి చెందిన యూరోపియ‌న్ సోష‌లిస్ట్ నాయ‌కుడు జియాకోమో ఫిలిబెక్ భార‌త్‌ను అవ‌మానిస్తుంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ చ‌ప్ప‌ట్లు కొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) ఆరోపించారు.

S

Telangana | Published On Nov 16, 2026, 3.20 pm IST

Ramchandar Rao | భార‌త్‌ను అవ‌మానిస్తుంటే రేవంత్‌, రాహుల్‌ చ‌ప్ప‌ట్లు కొడ‌త‌రా?
Advertisement
  • ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం ఉంట‌దా?
  • జియాకోమో ఫిలిబెక్‌తో పాటు స‌ద‌స్సు పెట్టిన‌వాళ్ల‌పై కేసులు పెట్టి జైలుకు పంపాలి
  • చైనా వంటి దేశాల్లో అయితే కాల్చిపారేస్త‌రు
  • భారత గడ్డను విదేశీయుల రాజకీయ జోక్యానికి వేదికగా మార్చే హక్కు కాంగ్రెస్‌కు లేదు
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మండిపాటు

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్‌: భార‌త్ స‌మ్మిట్ (Bharath Summit) సంద‌ర్భంగా ఇట‌లీకి చెందిన యూరోపియ‌న్ సోష‌లిస్ట్ నాయ‌కుడు జియాకోమో ఫిలిబెక్ భార‌త్‌ను అవ‌మానిస్తుంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ చ‌ప్ప‌ట్లు కొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) ఆరోపించారు. ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం ఉంటుందా అని మండిప‌డ్డారు. ఫిలిబెక్‌తో పాటు స‌ద‌స్సు నిర్వ‌హించిన వాళ్ల‌పై కేసులు పెట్టి జైలుకు పంపాల‌న్నారు. భార‌త గ‌డ్డ‌ను విదేశీయుల రాజ‌కీయ జోక్యానికి వేదిక‌గా మార్చే హ‌క్కు కాంగ్రెస్ పార్టీకి లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. జియాకోమో ఫిలిబెక్‌పై సోమ‌వారం విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO)లో ఫిర్యాదు (Complaint) చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నేన్ ముందే చెప్పిన‌..

ఇది పెట్టుబ‌డుల స‌ద‌స్సు కాద‌ని నేను మొద‌టి రోజే చెప్పాను. భార‌త వ్యతిరేక భావాల‌ను, వ్యాఖ్య‌ల‌ను, మాట‌ల‌ను విన్నాం. ఇటాలియ‌న్ నుంచి వ‌చ్చిన యూరోపియ‌న్ సోష‌లిస్ట్ నాయ‌కుడు అవ‌మానించేలా మాట్లాడారు. భార‌త్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడం ఏ ఒక్క విదేశీయుడికి త‌గ‌దు. వీసా రూల్స్ ప్ర‌కారం అలా మాట్లాడ‌డానికి వీల్లేదు. అమెరికాలో సోష‌ల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా వాళ్లు డీపోర్ట్‌ చేసి వాప‌స్ పంపిస్త‌రు. ఫిలిప్పీన్స్‌లో కూడా ఈమ‌ధ్య ఓ వ్య‌క్తి అక్క‌డ విమ‌ర్శిస్తే వెంట‌నే డీపోర్ట్‌ చేశారు.

ఇక ముస్లిం దేశాలు, చైనా వంటి దేశాల్లో కాల్చిపారేస్త‌రు. భార‌త్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడితే రాహుల్ గాంధీ స‌ప్ప‌ట్లు కొడుతున్న‌డు. ఆనందిస్తున్న‌డు. ఇంకోవైపు రేవంత్‌రెడ్డి న‌వ్వుతున్న‌డు. ఇంత‌క‌న్నా దేశ ద్రోహ చ‌ర్య ఏముంట‌ది. ఆ మాట్లాడిన వ్య‌క్తి భార‌త్‌లోనే ఉంటే డీపోర్ట్‌ చేయాలి.. ఒక‌వేళ ఆయ‌న పారిపోతే మ‌ళ్లా భార‌త్ రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. స‌ద‌స్సు పెట్టిన‌వాళ్ల మీద కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నం. ఈరోజు సాయంత్రం డీజీపీకి కూడా విన‌తిప‌త్రం ఇస్తాం.

ఏ దేశం అలా ఊరుకోదు

రాహుల్ గాంధీ విదేశాల‌కు పోయి భార‌త్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతరు. వీసా రూల్స్ తెల్వ‌యా వాళ్ల‌కు. వ‌చ్చినోళ్ల‌క‌న్నా జ్ఞానం ఉండాలే క‌దా. ఏ దేశ‌మైనా అలా ఊరుకుంటుందా. మ‌నం ఎందుకు ఊరుకోవాలే. స‌ద‌స్సుకు వ‌చ్చిన అంద‌రి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చెక్ చేయాలి. ఇన్వెస్టిగేష‌న్ చేసి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం కాంగ్రెస్ నేర్చుకోవాలి.

ఫారిన్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ యాక్ట్‌లో సెక్ష‌న్ 29, 23ల‌లో స్ప‌ష్టంగా ఉంది.. భార‌త్ వ‌చ్చి వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ సెక్ష‌న్ల‌లో ఉంది. ఇక్క‌డికి ఎవ‌రొచ్చినా రెస్పెక్ట్ ఇయ్యాలి. దీని నేరం కింద‌నే భావిస్తున్నం. ఇందుకు మూడు సంవ‌త్స‌రాల శిక్ష‌, మూడు ల‌క్ష‌ల ఫైన్ వేయాలి. పారిపోయిన వ్య‌క్తిని రప్పిచ్చి కేసు పెట్టి జైలులో వేయాలి. స‌ద‌స్సు నిర్వ‌హించిన వాళ్ల‌పై కూడా కేసు పెట్టి జైలుకు పంపాలి. వరుస ఎన్నికల పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీని మళ్లీ రాజకీయంగా నిలబెట్టేందుకు విదేశీయుల సహాయం కోరుతోంది. సదస్సు నిర్వాహకుల పాత్రపైనా లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశం. భారత చట్టాలకు ఎవరూ అతీతులు కారు. అంతే! అని రాంచంద‌ర్‌రావు త‌న‌దైన స్టైల్‌లో ఫైర‌య్యారు.

Advertisement
Advertisement