Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్‌లైన్ బుకింగ్!
Sabarimala Online Booking | అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కీలక అప్‌డేట్. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 2026–27 మండల మకరవిళక్కు ఉత్సవాలకు సంబంధించి వర్చువల్ క్యూ బుకింగ్ ప్రక్రియ అక్టోబర్ 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.
- శబరిమల దర్శనానికి వర్చువల్ క్యూ ప్రారంభం
- జనవరి 14న మకరవిళక్కు
- గత సీజన్‌లో 53లక్షలకు పైగా భక్తులు..
- ఈసారి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు
Sabarimala Online Booking | అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కీలక అప్‌డేట్. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 2026–27 మండల మకరవిళక్కు ఉత్సవాలకు సంబంధించి వర్చువల్ క్యూ బుకింగ్ ప్రక్రియ అక్టోబర్ 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతోపాటు, కొండపై యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు రోజువారీ దర్శన పరిమితులను ఖరారు చేసింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ www.sabarimalaonline.org ద్వారా ఉచితంగా దర్శన స్లాట్లు బుక్ చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది.
ఎప్పటి నుంచి.. ఎప్పటివరకు?
ఈ ఏడాది శబరిమల మండల మకరవిళక్కు వేడుకలకు సంబంధించిన కీలకమైన తేదీలను అధికారులు ప్రకటించారు. నవంబర్ 16న సాయంత్రం ఆలయ ద్వారాలు తెరవనుండగా, నవంబర్ 17 నుంచి మండల కాలం ప్రారంభం కానుంది. డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం తిరిగి తెరుస్తారు. 2027 జనవరి 14 మకరవిళక్కు వేడుకలు జరగనున్నాయి. అనంతరం జనవరి 20న ఈ సీజన్ యాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రోజుకు 80 వేల మందికి దర్శనం
భక్తుల రాకను నియంత్రించేందుకు రోజువారీ దర్శన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ విధానాన్ని రూపొందించారు. మొత్తం రోజువారీ పరిమితి 80 వేల మంది కాగా, ఇందులో ఆన్‌లైన్ వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ కోటాలు ఉంటాయి. నిలక్కల్–పంబ మార్గంలో రోజుకు 60 వేల ఆన్‌లైన్ స్లాట్లు, ఎరుమేలి అటవీ మార్గంలో రోజుకు 3వేలు, వండిపెరియార్–సత్రం మార్గంలో రోజుకు 3వేల ఆన్‌లైన్ స్లాట్లు జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుకింగ్ చేసుకోలేని భక్తుల కోసం స్పాట్ బుకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిలక్కల్‌లో రోజుకు 10వేల మందికి, ఎరుమేలిలో 2వేల మందికి, వండిపెరియార్–సత్రంలో 2వేల మందికి స్పాట్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పంబలో స్పాట్ బుకింగ్ కేంద్రం ఉండదు. అందువల్ల భక్తులు తమ ప్రయాణ మార్గానికి అనుగుణంగా ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గత సీజన్‌లో 53 లక్షలకు పైగా భక్తులు
శబరిమలకు ఏటా భక్తుల రాక పెరుగుతుండటంతో రద్దీ నియంత్రణ అధికారులకు కీలకంగా మారింది. 2024–25 మండల–మకరవిళక్కు సీజన్‌లో సుమారు 53.99 లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు సీజన్‌లో ఈ సంఖ్య సుమారు 46.77 లక్షలుగా నమోదైంది. అంటే ఒక్క ఏడాదిలోనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో 2026–27 సీజన్‌లోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా రోజువారీ బుకింగ్ పరిమితులు, రవాణా సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల ఆధారంగా రద్దీని నియంత్రించడంపై అధికారులు దృష్టి సారించారు.
బుకింగ్ ఉచితం.. ఈ వివరాలు తప్పనిసరి
వర్చువల్ క్యూ పాస్ పొందేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బుకింగ్ పేరుతో ఎవరైనా అదనపు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి. నమోదు ప్రక్రియకు ముందు భక్తులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ చిరునామా, గుర్తింపు పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక పోర్టల్‌లో ఖాతా క్రియేట్ చేసుకొని.. వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత అందుబాటులో ఉన్న దర్శన తేదీ, సమయం, యాత్ర మార్గాన్ని ఎంచుకోవాలి. బుకింగ్ పూర్తయ్యాక క్యూఆర్ కోడ్‌తో కూడిన వర్చువల్ క్యూ పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్‌లో భద్రపరుచుకోవాలి. యాత్ర సమయంలో సమయంలో తనిఖీలు ఏసిన సమయంలో ఈ పాస్‌ను చూపించాల్సి ఉంటుంది. ఫేక్ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలని.. కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మకరవిళక్కు సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శన తేదీ ఖరారు చేసుకున్న తర్వాతే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
- ●Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
- ●Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే
- ●Arunachal Pradesh China Incursion | అరుణాచల్‌లో డ్రాగన్ పంజా.. 50 కిలోమీటర్లు చొరబడిన చైనా సైన్యం?
- ●Gold Purchase | ధంతేరస్‌కు బంగారం కొంటున్నారా? స్వచ్ఛతను ఇలా గుర్తించండి!
- ●Priyanka Chopra | బయోపిక్‌లో చూపించినవన్నీ అబద్దాలే - ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గజ బాక్సర్ ఆరోపణలు

Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?

Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ

Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే

Arunachal Pradesh China Incursion | అరుణాచల్‌లో డ్రాగన్ పంజా.. 50 కిలోమీటర్లు చొరబడిన చైనా సైన్యం?






