త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor’s Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి.. నోటిఫికేష‌న్ రిలీజ్‌ చేసిన లోక్‌భ‌వ‌న్‌

Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌-2026కు దరఖాస్తులు చేసుకునేందుకు తెలంగాణ లోక్‌భ‌వ‌న్ (Telangana Lok Bhavan) నోటిఫికేష‌న్ (Notification) రిలీజ్ చేసింది.

S

Telangana | Published On Nov 16, 2026, 4.54 pm IST

Governor’s Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి.. నోటిఫికేష‌న్ రిలీజ్‌ చేసిన లోక్‌భ‌వ‌న్‌
Advertisement

Governor's Awards for Excellence-2026 | త్రినేత్ర న్యూస్‌: గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌-2026కు దరఖాస్తులు చేసుకునేందుకు తెలంగాణ లోక్‌భ‌వ‌న్ (Telangana Lok Bhavan) నోటిఫికేష‌న్ (Notification) రిలీజ్ చేసింది. ఈ దరఖాస్తుల నోటిఫికేషన్‌ను లోక్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ సోమ‌వారం విడుదల చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామ‌ని తెలిపారు. నాలుగు విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేస్తామని ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌దర్శి పేర్కొన్నారు.

ఈనెల 16 నుంచి డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్వీకరించిన దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం.. 2027 జనవరి మొదటి వారంలో ‘గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2026’ విజేతలను ప్రకటిస్తామని దానకిషోర్ పేర్కొన్నారు.

గత ఐదేళ్లుగా సమాజంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తులు (Individuals), సంస్థలు/ట్రస్టులు/సొసైటీలు (Institutions/Organizations) ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆసక్తి, అర్హత కలిగినవారు తెలంగాణ లోక్‌భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా నిర్ణీత ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో నేరుగా దరఖాస్తులను అంద‌జేయ‌వ‌చ్చు. ఎంపికైన విజేతలకు 2027, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, రూ. 2 లక్షల చొప్పున‌ నగదు బహుమతులు అంద‌జేస్తారు.

ఏయే విభాగాల్లో ఇస్తారంటే..

  • మాదకద్రవ్యాల నిర్మూలన: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు..
  • ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం: ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాటుపడుతున్న వారికి..
  • పర్యావరణ, జల సంరక్షణ: భూగర్భ జలాల పెంపుదల, చెరువుల పరిరక్షణ మరియు విరివిగా మొక్కల పెంపకంలో విశేష కృషి చేసిన వారికి..
  • స్టార్టప్‌లు, ఆవిష్కరణలు: వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో పాటు ఉత్తమ పనితీరు కనబరుస్తున్న స్టార్టప్ సంస్థలకు.

వెబ్‌సైట్‌: governor.telangana.govt.in

Advertisement
Advertisement