Indian Coast Guard | అరేబియా సముద్రంలో రూ.3వేల కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. ఐదుగురు పాక్ జాతీయులు అరెస్ట్
Indian Coast Guard | అరేబియా సముద్రంలో (Arabian Sea) ఇరాన్‌కు చెందిన ఓ పడవ (Iranian boat)లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. భారత తీరరక్షక దళం (Indian Coast Guard), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat ATS) సంయుక్తంగా చేపట్టిన మెగా ఆపరేషన్‌లో రూ.3,000 కోట్ల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు.
Indian Coast Guard | త్రినేత్ర న్యూస్ : అరేబియా సముద్రంలో (Arabian Sea) డ్రగ్స్ కలకలం రేపాయి. భారత్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను (drugs seized) తరలిస్తున్న పాకిస్థాన్ ముఠా గుట్టును ఇండియన్ కోస్ట్ గార్డ్ రట్టు చేసింది. భారత తీరరక్షక దళం (Indian Coast Guard), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat ATS) సంయుక్తంగా చేపట్టిన మెగా ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్‌కు చెందిన ఓ పడవ (Iranian boat) నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్షద్వీప్ సమీపంలో సెప్టెంబర్ 25న నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 526 కిలోల మెథాంఫెటామైన్, హెరావిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.3,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. విశ్వసనీయ నిఘా సమాచారంతో అనుమానాస్పదంగా కదులుతున్న ఓ ధావ్ పడవను భద్రతా బలగాలు గుర్తించాయి. సముద్ర, వైమానిక నిఘా వ్యవస్థల ద్వారా పడవ కదలికలను నిరంతరం పర్యవేక్షించిన అధికారులు, అనంతరం దాన్ని వెంబడించారు. లక్షద్వీప్‌కు పశ్చిమ దిశలో దానిని అడ్డగించారు.

పడవను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో హై-గ్రేడ్ మెథాంఫెటామైన్, హెరావిన్ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని చూసి అధికారులు సైతం నివ్వెరపోయారు. మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పడవలోని ఐదుగురు పాక్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన పడవ, నిందితులు, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను సాయుధ భద్రతా బలగాల నడుమ ముంబైకి తరలించారు. అక్కడ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా వీరిని విచారిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఘటనతో సముద్ర మార్గాల ద్వారా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాను అణచివేయడానికి భద్రతా సంస్థలు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.
Also Read..
AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం
తాజావార్తలు
- ●Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
- ●CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..
- ●Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ
- ●Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Apple Pay India | యాపిల్ పే వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తోనే చెల్లింపులు..
- ●Harish Rao | 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ పాత్రలో జీవించావు..

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన

CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..

Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ

Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం






