త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pak Ship Collides With Indian Navy Unit | అంత‌ర్జాతీయ జ‌లాల్లో అనూహ్య ప‌రిణామం.. భార‌త నౌక‌ను ఢీ కొట్టిన పాక్ నౌక‌

Pak Ship Collides With Indian Navy Unit | అరేబియా స‌ముద్రంలో (Arabian Sea) అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌త నౌక (Indian ship)ను పాకిస్థాన్ నౌక (Pakistani Navy vessel) ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన భార‌త్‌.. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ తాత్కాలిక రాయబారి సాద్ అహ్మద్ వరాచ్‌ను పిలిపించి నిర‌స‌న వ్య‌క్తం చేసింది.

D

National | Published On Sep 16, 2026, 1.42 pm IST

Pak Ship Collides With Indian Navy Unit | అంత‌ర్జాతీయ జ‌లాల్లో అనూహ్య ప‌రిణామం.. భార‌త నౌక‌ను ఢీ కొట్టిన పాక్ నౌక‌
Advertisement

Pak Ship Collides With Indian Navy Unit | త్రినేత్ర‌.న్యూస్ : అంత‌ర్జాతీయ జ‌లాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. భార‌త నౌక (Indian ship)ను పాకిస్థాన్ నౌక (Pakistani Navy vessel) ఢీ కొట్టింది. సెప్టెంబ‌ర్ 15 సాయంత్రం అరేబియా స‌ముద్రంలో (Arabian Sea) ఈ అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌక (frontline warship) సాధారణ నిఘా మిషన్‌లో ఉండగా.. పాకిస్థాన్ నౌక ఒకటి అత్యంత వేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు.

ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన భార‌త్‌.. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ తాత్కాలిక రాయబారి (Islamabads Envoy) సాద్ అహ్మద్ వరాచ్‌ను పిలిపించి నిర‌స‌న వ్య‌క్తం చేసింది. అంత‌ర్జాతీయ జ‌లాల్లో పాక్ నావికాద‌ళం వ్య‌వ‌హ‌రించిన తీరు అత్యంత బాధ్యతారాహిత్యమైన‌ద‌ని తెలిపింది. సైనిక విన్యాసాలు, కదలికలపై ఇరు దేశాల మ‌ధ్య కుదిరిన 1991 నాటి ఒప్పందంలోని 10వ నిబంధ‌న‌కు పూర్తిగా విరుద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సందేశాన్ని భార‌త త‌ర‌ఫున పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ‌కు చేర‌వేయాల‌ని పాక్ రాయ‌బారిని ఆదేశించింది. అంతేకాదు, ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా కూడా పాక్ విదేశాంగ శాఖకు భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా సైనిక విభాగాలు జాగ్రత్తలు వహించాలని సూచించింది.

Also Read..

చ‌రిత్ర‌లోనే తొలిసారి.. హౌతీల దాడుల‌తో మ‌క్కాలో హై అల‌ర్ట్‌

ప్ర‌ధాని ఫ్రెండ్‌కు భారీ ఊర‌ట‌.. మోదీని క‌లిసిన‌ వెంట‌నే వివాదాస్ప‌ద భూమిపై వెన‌క్కిత‌గ్గిన ఎమ్మెల్యే

వినాయ‌క చ‌వితి ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

Advertisement
Advertisement