త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ ​గార్డ్​లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Indian Coast Guard | భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత తీరరక్షక దళం (Indian Coast Guard) గుడ్ న్యూస్ అందించింది. మొత్తం 365 పోస్టుల‌కు కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (ICG CGEPT)-01/2027, 02/2027 బ్యాచ్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

G

National | Published On Oct 15, 2026, 6.51 am IST

Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ ​గార్డ్​లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
Advertisement

Indian Coast Guard | త్రినేత్ర న్యూస్‌: ఇండియన్ కోస్ట్ గార్డ్​లో పనిచేయాలనుకుంటున్నారా? అయితే మీకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత తీరరక్షక దళం (Indian Coast Guard) గుడ్ న్యూస్ అందించింది. మొత్తం 365 పోస్టుల‌కు కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (ICG CGEPT)-01/2027, 02/2027 బ్యాచ్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఇందులో Navik (జ‌న‌ర‌ల్ డ్యూటీ), యాంత్రిక్ (Yantrik), హైజీనిస్ట్ (Hygienist) పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు www.ssc.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 21 వ‌ర‌కు పురుషులతో పాటు అర్హులైన మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష‌, శరీర దారుఢ్య, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేయ‌నుంది. ఎంపికైన వారికి ముందుగా శిక్ష‌ణ ఇస్తారు. అనంత‌రం విధుల్లోకి తీసుకుంటారు. నావిక్ పోస్టులకు రూ.21,700+ అలవెన్సులు, యాంత్రిక్ పోస్టులకు రూ.29,200+ అలవెన్సులు ప్ర‌తినెల జీత వ‌స్తుంది.

మొత్తం పోస్టులు: 365

నావిక్ (GD)- 270 (పురుషులు 234, మహిళలు 26)
యాంత్రిక్- 68 (మెకానికల్ 28, ఎలక్ట్రికల్ 23, ఎలక్ట్రానిక్స్ 9)
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)- 25
హైజీనిస్ట్‌-I- 20

అర్హతలు

నావిక్(జీడీ) పోస్టులకు.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో  12వ తరగతి ఉత్తీర్ణుల‌వ్వాలి.
యాంత్రిక్ ఉద్యోగాల‌కు.. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
హైజీనిస్ట్‌-I పోస్టులకు.. మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా తత్సమాన అర్హత త‌ప్ప‌నిస‌రి.
అభ్యర్థుల ఏజ్ 18 నుంచి 22 ఏండ్ల‌ మధ్య ఉండాలి. అంటే 2005 నవంబర్ 1 నుంచి 2009 మే 1 మధ్య, హైజీనిస్ట్‌-I పోస్టులకు 2002 నవంబర్ 1 నుంచి 2009 అక్టోబర్ 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

4 దశల్లో ఉంటుంది. మొద‌ట కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌(CBT) నిర్వ‌హిస్తారు. 100 మార్కులకు ప‌రీక్ష‌ ఉంటుంది. 100 ప్రశ్నలు అడుగుతారు. 60 నిమిషాల్లో పూర్తి చేయాలి.
స్టేజ్‌-2: ఫిజిక‌ల్ ఎఫీషియ‌న్సీ టెస్ట్‌, అసెస్‌మెంట్ అండ్‌ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ పరీక్ష ఉంటుంది.
స్టేజ్‌-3: ఐఎన్‌ఎస్‌ చిల్కాలో తదుపరి ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
స్టేజ్‌-4: డాక్యుమెంట్‌ ఆథెంటికేషన్‌ ప్రాసెస్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్​లైన్‌లో.
ప‌రీక్ష ఫీజు: రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబర్‌ 21
సీజీఈపీటీ 01/2027 స్టేజ్-I: నవంబర్‌లో
స్టేజ్‌-II: 2027 ఫిబ్రవరి నెలాఖ‌రు​లో
స్టేజ్‌-III: 2027 మే ప్రారంభంలో
సీజీఈపీటీ (CGEPT 02/2027)స్టేజ్-I: 2027 అక్టోబర్ మధ్యలో
వెబ్‌సైట్‌: www.ssc.gov.in

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement