HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెండ్ యూనియన్ ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) జెండా ఎగురవేసింది. అధ్యక్షురాలిగా ఎస్ఎఫ్ఐ నాయకురాలు దిల్షాదా రైహాన్ (Dilshada Raihan) విజయం సాధించారు.
HCU | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెండ్ యూనియన్ ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) జెండా ఎగురవేసింది. అధ్యక్షురాలిగా ఎస్ఎఫ్ఐ నాయకురాలు దిల్షాదా రైహాన్ (Dilshada Raihan) విజయం సాధించారు. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు (Students Union Election) సోమవారం జరిగాయి. దీనిలో 5,900 ఓట్లకు గానూ 79 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ ప్యానల్, ఏబీవీపీ-ఎస్ఎల్‌వీడీ, ఎన్ఎస్ యూఐ ప్యానెల్స్ పోటీలో నిలిచాయి. అయితే, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, టీఎఫ్ఎఫ్ విద్యార్థి సంఘాలతో కూడిన SFI- ASAప్యానెల్, ABVP-SLVD (సేవలాల్ విద్యార్థి దళ్) మధ్యే హోరాహోరిగా పోరు సాగింది.
మంగళవారం ఉదయం నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలైంది. రాత్రి పొద్దుపోయే వరకు ఓట్ల లెక్కింపు సాగింది. తాజాగా ఫలితాలను హెచ్‌సీయూ ప్రకటించింది. ప్రెసిడెంట్‌గా ఎస్ఎఫ్ఐ ప్యానెల్ ప్రతినిధి దిల్షాదా.. ఏబీవీపీ ప్రతినిధిపై 221 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఎన్ఎస్‌యూఐ (NSUI) ప్యానెల్ నుంచి పీడీఎస్ యూ లీడర్ నవీన్ కుమార్ కు 461 ఓట్లు వచ్చాయి.. నోటాకు 217 ఓట్లు పోల్ అవగా మరో 55 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాగా, ఉపాధ్యక్షుడిగా TSFకి చెందిన కొర్రా నితిన్ చౌహాన్ (212 ఓట్లతో), జనరల్ సెక్రటరీగా ASAకి చెందిన ప్రతీక్ (177 ఓట్లతో) విజయం సాధించారు.
సంబంధిత వార్తలు

NSUI Venkata Swamy | బల్మూరి వెంకట్ నన్ను వివక్షకు గురి చేస్తున్నడు
సెప్టెంబర్ 24, 2026

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
సెప్టెంబర్ 5, 2026

Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరిన మాజీ మంత్రి వేముల
- ●YouTube | యూట్యూబ్‌తో భారత్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం.. రూ.18 వేల కోట్ల జీడీపీకి దోహదం..
- ●Harish Rao | ఆ మహోన్నత పోరాటానికి 14 ఏండ్లు.. తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం సాగరహారం: హరీశ్ రావు
- ●Jawan Opens Fire | తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
- ●Indian Coast Guard | అరేబియా సముద్రంలో రూ.3వేల కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. ఐదుగురు పాక్ జాతీయులు అరెస్ట్

Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరిన మాజీ మంత్రి వేముల

YouTube | యూట్యూబ్‌తో భారత్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం.. రూ.18 వేల కోట్ల జీడీపీకి దోహదం..

Harish Rao | ఆ మహోన్నత పోరాటానికి 14 ఏండ్లు.. తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం సాగరహారం: హరీశ్ రావు

Jawan Opens Fire | తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి



