Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
Donald Trump | కృత్రిమ మేథస్సు (Artifician Intelligence)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త పేరు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence)ను ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ (Super Intelligence - SI) గా పిలవాలని అధికారికంగా ప్రకటించారు.
International | Published On Sep 30, 2026, 11.20 am IST
Donald Trump | త్రినేత్ర న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలనానికి తెరలేపారు. కృత్రిమ మేథస్సు (Artifician Intelligence) కు కొత్త పేరును పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence)ను ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ (Super Intelligence - SI) గా పిలవాలని అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రాలు, వెబ్‌సైట్లు, నివేదికలు, కమ్యూనికేషన్లలో ఇకపై AI కి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ (SI) అనే పదాన్ని వాడాలని ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.
అంతకుముందు వైట్ హౌస్‌లో టెక్ దిగ్గజాలతో ట్రంప్ సమావేశమయ్యారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, కృత్రిమ మేధస్సు (AI) పరిశోధనా సంస్థ OpenAI సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. టెక్ దిగ్గజాలతో భేటీ అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం ప్రకటించారు. ‘ఆర్టిఫిషియల్’ (కృత్రిమ) అనే పదం వినడానికి 'నకిలీ' అనే భావనను కలిగిస్తోందని, కానీ ఈ టెక్నాలజీ నకిలీది కాదని, అత్యంత అద్భుతమైనదని ట్రంప్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
🇺🇸 I’m not sure there has ever been a table quite like the one Trump assembled at the White House today.
Elon on his left. Jensen Huang on his right. Zuckerberg, Pichai, Bezos and many of the people actually building the AI economy around them.
And Trump’s message to the room…
— Mario Nawfal (@MarioNawfal) September 29, 2026
Also Read..
భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్ఏఐ పార్ట్నర్షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..
సెప్టెంబర్ 28, 2026

Benjamin Netanyahu | ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహు ప్రసంగం.. 90 శాతం సీట్లు ఖాళీ
సెప్టెంబర్ 25, 2026

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్‌పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
- ●CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..
- ●Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ
- ●Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Apple Pay India | యాపిల్ పే వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తోనే చెల్లింపులు..
- ●Harish Rao | 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ పాత్రలో జీవించావు..

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన

CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..

Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ

Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం



