Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం
Indian Navy | అంతర్జాతీయ జలాల్లో ఇండియన్ నేవీ (Indian Navy) మరోసారి తన శౌర్యాన్ని ప్రదర్శించింది. సోమాలియా సముద్ర దొంగల (Somali pirates) బారిన పడిన ఇరాన్ చేపల వేట నౌక ‘అజిని (Azini)’ని కాపాడింది. అందులోని 20 మందిని దొంగల చెర నుంచి సురక్షితంగా విడిపించింది.
Indian Navy | త్రినేత్ర న్యూస్ : అంతర్జాతీయ జలాల్లో ఇండియన్ నేవీ (Indian Navy) మరోసారి తన శౌర్యాన్ని ప్రదర్శించింది. అరేబియా సముద్రంలో (Arabian Sea) డేరింగ్ ఆపరేషన్ (Daring Operation) నిర్వహించి సముద్ర దొంగల ఆటకట్టించింది. సోమాలియా సముద్ర దొంగల (Somali pirates) బారిన పడిన ఇరాన్ చేపల వేట నౌక ‘అజిని (Azini)’ని కాపాడింది. అందులోని 20 మందిని దొంగల చెర నుంచి సురక్షితంగా విడిపించింది.
48 గంటలపాటూ సాగిన డేరింగ్ ఆపరేషన్
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరానికి సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలో 48 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. సోమాలియా ఈశాన్య తీరంలోని (coast of Somalia) బందర్ బైలా, హాఫున్ ప్రాంతాల మధ్య అక్టోబర్ 29న ఇరాన్ ఫిషింగ్ నౌకను సముద్ర దొంగలు అపహరించారు. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ వెంటనే రంగంలోకి దిగింది. P-8I సముద్ర నిఘా విమానాలతో పాటు భారత యుద్ధనౌక INS కోల్‌కతాను మోహరించారు. మెరైన్ కమాండోలు (MARCOS), మారిటైమ్ రికనైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు భారత వైమానిక దళానికి (IAF) చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానం, MQ-9 డ్రోన్ల సాయంతో హైజాక్ అయిన బోటను గుర్తించి చుట్టుముట్టింది.
బోటు కదలికలను నిరంతరం పర్యవేక్షించింది. సముద్రపు దొంగలకు మరో నౌకపై దాడి చేసే అవకాశం లేకుండా చేయడమే కాకుండా, బోటుపై నియంత్రణ సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. టైమ్ చూసుకుని ఐఏఎఫ్‌కు చెందిన సీ-17 విమానం ద్వారా భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలను సముద్రంలోకి అత్యంత కచ్చితత్వంతో ఎయిర్‌డ్రాప్ చేసింది. అనంతరం కమాండోలు చాకచక్యకంగా బోటును తన ఆధీనంలోకి తీసుకున్నారు. బోటులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో 48 గంటలపాటూ సాగిన ఈ డేరింగ్ ఆపరేషన్ నిన్నటితో విజయవంతంగా ముగిసింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు
ఇండయన్ నేవీ డేరింగ్ ఆపరేషన్ విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. ఈ మేరకు భారత నావికాదళాన్ని అభినందించారు. దీన్ని అత్యంత సమన్వయంతో కూడిన ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఈ మిషన్‌లో సహకరించిన భారత వైమానిక దళాన్ని (Indian Air Force) కూడా ఆయన కొనిసాడారు. భారత నావికాదళం అత్యున్నత స్థాయి సన్నద్ధతను, సముద్ర మార్గాల్లో ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించిందని చెప్పుకొచ్చారు.
భారత సేవలను కొనియాడిన ఇరాన్
అజిని నౌకలోని 20 మంది ఇరాన్ సిబ్బందిని సముద్ర దొంగల నుంచి రక్షించినందుకు గానూ భారత ప్రభుత్వానికి, నేవీ, వైమానిక దళానికి ఇరాన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. భారత సాయుధ దళాల నైపుణ్యం, ధైర్యసాహసాలు, సమన్వయం అభినందనీయమని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది.
My congratulations to #Indian Navy for successfully executing a meticulously coordinated 48-hour operation to rescue all 20 crew members of the pirated fishing vessel, Azini, more than 3000 km from Mumbai in the Arabian Sea, on 02 Nov 26.
The swift localisation, interception and safe release of the crew and vessel from significantly-armed pirates, with timely support from the Indian Air Force, speak well of the Indian Navy’s high operational readiness and ability to respond decisively to maritime threats across the region.
Our brave personnel have once again demonstrated India’s ability, intent and resolve to safeguard lives, uphold maritime security and ensure stability across the Indian Ocean Region.
India continues to stand resolute in ensuring SAFE SEAS and a free, open and secure Indian Ocean Region.
#IndianNavy #IndianAirForce #SafeSeas
— Rajnath Singh (@rajnathsingh) November 2, 2026
Also Read..
ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?
- ●Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
- ●Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
- ●Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
- ●LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?

Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?

Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి

Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి






