త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బ‌డ్జెట్ ఫోన్‌.. ప్ర‌త్యేక ఏఐ కూడా..

Lava Shark 2 Pro 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ లావా భార‌త్‌లో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా షార్క్ 2 ప్రొ 5జి పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. గ‌త నెల విరాట్ వి1 ప్రొ 5జి ఫోన్‌ను లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. మిడ్ రేంజ్ విభాగ వినియోగ‌దారుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన కెమెరాలు, ప్ర‌త్యేక‌మైన ఏఐ అసిస్టెంట్ త‌దిత‌ర స‌దుపాయాల‌ను అందించారు.

S

Technology | Published On Sep 30, 2026, 11.13 am IST

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బ‌డ్జెట్ ఫోన్‌.. ప్ర‌త్యేక ఏఐ కూడా..
Advertisement

Lava Shark 2 Pro 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ లావా భార‌త్‌లో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా షార్క్ 2 ప్రొ 5జి పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. గ‌త నెల విరాట్ వి1 ప్రొ 5జి ఫోన్‌ను లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. మిడ్ రేంజ్ విభాగ వినియోగ‌దారుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీ, అద్భుత‌మైన కెమెరాలు, ప్ర‌త్యేక‌మైన ఏఐ అసిస్టెంట్ త‌దిత‌ర స‌దుపాయాల‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. ఫ్లూయిడ్ స్క్రోలింగ్‌, నావిగేష‌న్ సాధ్య‌మ‌వుతాయి. ఈ ఫోన్‌కు గాను ఐపీ64 డ‌స్ట్‌, స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ఆకాష్ బ్లూ, నంద సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసాక్ టి8200 ప్రాసెస‌ర్ ఉంది. 6జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను అద‌నంగా వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 6జీబీ వ‌ర‌కు పెంచుకునే స‌దుపాయం కూడా ఉంది. 128జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫేస్ అన్‌లాక్ స‌దుపాయం కూడా ఉంది. ఈ ఫోన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ దీని బ్యాట‌రీ. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాటరీని ఇచ్చారు. రోజువారీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా అందించేలా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దిన‌ట్లు కంపెనీ తెలిపింది. దీనికి 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇచ్చారు.

ఏఐ కెమెరా..

వెనుక‌వైపు 50 మెగాపిక్స‌ల్ ఏఐ ప్ర‌ధాన కెమెరా ఉంది. 2కె వీడియో రికార్డింగ్‌కు ఇది మ‌ద్ద‌తును ఇస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. డ్యుయ‌ల్ 5జి క‌నెక్టివిటీ, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, బ్లూటూత్ 5.4 వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా ఇస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. దీని వ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన ఇంట‌ర్‌ఫేస్ ల‌భిస్తుంది. అలాగే లావా సొంతంగా అభివృద్ధి చేసిన వాయు ఏఐ ఇందులో ఉంది. ఈ ఫోన్‌కు గాను ఒక ప్ర‌ధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌ను, 2 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఫోన్ కొనుగోలు అనంత‌రం వినియోగ‌దారుల‌కు ఫ్రీ స‌ర్వీస్ ఎట్ హోమ్ కార్య‌క్ర‌మాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపింది.

లావా షార్క్ 2 ప్రొ 5జి ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్‌ను రూ.16,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ ఫోన్ ఇప్ప‌టికే స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుల‌భ‌మైన వాయిదా ప‌ద్ధ‌తుల్లో ఫోన్‌ను కొనుగోలు చేసే వీలు క‌ల్పించారు.

Advertisement
Advertisement