Manchi Redy Kishan Reddy | కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఆలోచన కేసీఆర్‌దే: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
Manchi Redy Kishan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనతోనే కోహెడలో ఫ్రూట్ మార్కెట్ (Koheda Froot Market) నిర్మించాలనుకున్నామని, అందుకు రూ.17 కోట్లతో 170 ఎకరాల భూమిని సమీకరించామని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (Kishan Reddy) చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనతోనే కోహెడలో ఫ్రూట్ మార్కెట్ (Koheda Froot Market) నిర్మించాలనుకున్నామని, అందుకు రూ.17 కోట్లతో 170 ఎకరాల భూమిని సమీకరించామని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (Kishan Reddy) చెప్పారు. రైతులకు ఒక్కొకరికి 7 లక్షల 50 వేల రూపాయలు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను తీసుకుందని తెలిపారు. సోమవారం ఆయన కోహెడలో మాట్లాడారు.
భూములపై కేబినెట్ నిర్ణయం?
ఆనాడు కోహెడ భూముల్లో అనేక మంది కబ్జాల్లో ఉన్నారు. 17 కోట్ల రూపాయలతో 170 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి భూములను ఇచ్చారు. 350 కోట్ల రూపాయలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ ను అభివృద్ధి చేసుకోవాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూముల పై కన్నేసింది. ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఈ భూములపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా దాస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భూముల పై కన్నేసింది. నాదర్ గుల్ లో 374 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైతే మాజీ మంత్రి డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆధారాలతో సహ బయటపెట్టారు. ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన కోహెడ భూముల పై స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో అమ్మేందుకు సిద్ధమయ్యారు. భూములను ఫ్రూట్ మార్కెట్ కే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అని మంచిరెడ్డి అన్నారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ స్థలాన్నిమాజీ మంత్రి డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి , కాలేరు వెంకటేష్, క్యామ మల్లేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు.
కోహెడ మార్కెట్ భూములపై కాంగ్రెస్ కన్ను: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ 1985 లో ఏర్పాటైంది. నగర విస్తరణలో భాగంగా గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ నగరం నడిబొడ్డున అయింది. అనేక ఫ్రూట్ వాహనాలు గడ్డి అన్నారం వచ్చి పోతుంటాయి. దీంతో కాలుష్య తీవ్రత ఎక్కువ అయింది. కరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో గడ్డి అన్నారం దగ్గర ఆసుపత్రి నిర్మించాలని హరీష్ రావు ఆలోచించారు. అందుకే అక్కడున్న ఫ్రూట్ మార్కెట్ ను కోహెడ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఎమ్మెల్యే ఇడ్లీ బండిని కూడా వదలడు..
కోహెడ మార్కెట్ ను 350 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయాలని ఆనాడు కేసీఆర్, హరీష్ రావు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ భూములపై కన్నేసింది. ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ఈ భూములను ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆనాడు తాత్కాలికంగా షెడ్లు వేశాం. గాలి వానకు కూలిపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా రచ్చ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఆయన పాన్ డబ్బా నుంచి మొదలు ఇడ్లీ బండి వరకు ఏది వదలడు. తన మంత్రి పదవి కోసం అమెరికా మాజీ ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ తో దొంగ లెటర్ ను రాహుల్ గాంధీకి రాయించారు. అలాంటి వ్యక్తి కోహెడ భూములపై కన్నేశారు అని ఆరోపించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని






