CP Sajjanar | ఖరీదైన గ్యాడ్జెట్లు కాదు.. పిల్లలకు సమయాన్ని కానుకగా ఇవ్వండి: సీపీ సజ్జనార్
CP Sajjanar | వేసవి (Summar) సెలవులొస్తున్నాయని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP Sajjanar) సూచించారు. ఈ వేసవి సెలవు(Holidays)ల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.
త్రినేత్ర.న్యూస్: వేసవి (Summar) సెలవులొస్తున్నాయని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP Sajjanar) సూచించారు. సోషల్ మీడియా(Social Media) , స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరితే పిల్లల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ వేసవి సెలవు(Holidays)ల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమయాన్ని వెచ్చించాలన్నారు. పనుల్లో నిమగ్నమై సమయాన్ని కేటాయించలేకపోవడం వల్లే వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని చెప్పారు. దీంతో పిల్లలు ఒంటరితనానికి గురవుతున్నారన్నారు. అపరిచితుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. కేవలం మందలింపులకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారని, ఇలాంటి ఘటనలు నగరంలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
ఒకప్పుడు వేసవి సెలవులంటే ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటలే ఉండేవని, కానీ నేటి బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో వారికి కొండంత భరోసానివ్వాలని కోరారు. ఎప్పటికప్పుడు వారికి దిశానిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని





