త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP | మోదీ అంటే భ‌యం.. అందుకే స‌మ‌స్య‌ల గురించి కాకుండా స‌మోసాల గురించి మాట్లాడుతున్నారు.. చ‌ద్ధాపై ఆప్ నేత‌ల విమ‌ర్శ‌లు

AAP | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha) మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు రాఘ‌వ్ చ‌ద్ధా భ‌య‌ప‌డుతున్నార‌ని ఆప్ నేష‌న‌ల్ మీడియా చీఫ్ అనురాగ్ దండా (Anurag Dhanda) వ్యాఖ్యానించారు.

D

National | Published On Apr 3, 2026, 3.19 pm IST

AAP | మోదీ అంటే భ‌యం.. అందుకే స‌మ‌స్య‌ల గురించి కాకుండా స‌మోసాల గురించి మాట్లాడుతున్నారు.. చ‌ద్ధాపై ఆప్ నేత‌ల విమ‌ర్శ‌లు
Advertisement

AAP | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha) మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. రాజ్య‌స‌భ‌లో ఆప్ డిప్యూటీ లీడ‌ర్ (Rajya Sabha deputy leader) ప‌ద‌వి నుంచి చ‌ద్ధాను కేజ్రీపార్టీ తొల‌గించిన విష‌యం తెలిసిందే. పార్టీ నిర్ణ‌యంపై చ‌ద్ధా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న గొంతు నొక్కారేమో గానీ.. త‌న‌ని ఓడించ‌లేరంటూ ఆప్‌కు సందేశం పంపారు. ఈ నేప‌థ్యంలో ఎంపీ సందేశానికి ఆప్ తాజాగా కౌంటర్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు రాఘ‌వ్ చ‌ద్ధా భ‌య‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించింది. అందుకే దేశంలో ముఖ్య‌మైన సమస్యలపై కాకుండా.. ఎయిర్‌పోర్టు క్యాంటీన్ల‌లో సమోసాల ధ‌ర‌ల త‌గ్గింపు గురించి చర్చిస్తూ తన పార్లమెంటరీ సమయాన్ని వృధా చేస్తున్నార‌ని ఆరోపించింది.

"రాఘ‌వ్ చ‌ద్ధా గత కొన్నేళ్లుగా భయపడుతున్నారు. ఆయ‌న మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేక‌పోతున్నారు. దేశంలోని ముఖ్య‌మైన సమస్యలను లేవనెత్తడానికి భయపడుతున్నారు. అందుకే ఎయిర్‌పోర్టు క్యాంటీన్ల‌లో స‌మోసా ధ‌ర‌ల త‌గ్గింపు గురించి చ‌ర్చిస్తూ.. స‌భ‌లో మాట్లాడేందుకు ల‌భించే కొద్దిపాటి స‌మయాన్ని కూడా వృధా చేస్తున్నారు. స‌భ‌లో పార్టీకి మ‌ద్ధ‌తుగా ఉండేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించారు. గుజ‌రాత్‌లో ఆప్ కార్య‌క‌ర్త‌లు అరెస్ట్ అయితే ఆ విష‌యాన్ని స‌భ‌లో లేవ‌నెత్తలేదు. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై కూడా ఆయ‌న సంత‌కం చేసేందుకు నిరాక‌రించారు. ఆప్ ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేస్తే.. ఆయన మాత్రం త‌న సీట్లో నుంచి క‌ద‌ల్లేదు" అని ఆప్ నేష‌న‌ల్ మీడియా చీఫ్ అనురాగ్ దండా (Anurag Dhanda) పేర్కొన్నారు.

మ‌రోవైపు ఆప్ నేత సంజ‌య్ సింగ్ (Sanjay Singh) కూడా రాఘ‌వ్ చ‌ద్ధాపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. చ‌ద్ధా పార్టీ ప‌క్షాన ఎన్న‌డూ నిల‌బ‌య‌డ‌లేద‌ని అన్నారు. "పార్లమెంటులో వివిధ జాతీయ సమస్యలకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడల్లా.. మీరు దానిపై సంతకం చేయరు. ఆ తీర్మానాల‌కు మద్దతు ఇవ్వరు. మోదీకి వ్యతిరేకంగా గళం విప్పరు. అనేక ప్ర‌ధాన‌ సమస్యలపై మాట్లాడ‌కుండా మౌనంగా ఉంటారు. గుజరాత్‌లో పార్టీ కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు కూడా మీరు మాట్లాడ‌లేదు" అని ఆయన విమ‌ర్శించారు.

Also Read..

అన్నామలైకి షాక్‌.. 27 మంది అభ్య‌ర్థుల జాబితాలో పేరు గ‌ల్లంతు..!

ఏఐ కెమెరాల‌తో లాంచ్ అయిన రియ‌ల్‌మి16 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

చంద‌మామ దిశ‌గా.. ఆర్టెమిస్-2 మిషన్

Advertisement
Advertisement