Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీపై రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు..!
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీపై రాజ్యసభ సభ్యుడు రఘవ్ చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎంపీలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. విలీనం తర్వాత నుంచి తమకు నిరంతర వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీపై రాజ్యసభ సభ్యుడు రఘవ్ చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎంపీలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. విలీనం తర్వాత నుంచి తమకు నిరంతర వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని జలంధర్‌లో హర్భజన్ సింగ్ నివాసంపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. పంజాబ్ పోలీసుల సహకారంతో.. ఆయన ఇంటి ఎదుట “దేశద్రోహి” అని రాయించారని, అలాగే ఆయన కుటుంబీకులపై వ్యతిరేకంగా, అవమానించేలా నినాదాలు చేశారన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్ర గుప్తా ఫ్యాక్టరీని మల్వా ప్రాంతంలో మూసివేయించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఫ్యాక్టరీ నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిందని, కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు నిర్వహించి చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఐఐటీ ప్రొఫెసర్, ఎంపీ సందీప్ పాఠక్‌పై ఉద్దేశపూర్వకంగా రెండు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని రఘవ్ చద్దా ఆరోపించారు. ఆయన అరెస్టు అవుతున్నారని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయించారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు తనను మంచి, సంస్కారమైన వ్యక్తిగా చూసేవారని.. పార్టీని వీడిన తర్వాత అవినీతిపరుడిగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం, నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో విషపూరిత పని వాతావరణం ఉందని తాను చెప్పానని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీ అవినీతి, రాజీపడే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డారు. పంజాబ్ ప్రభుత్వ అధికారులను రఘవ్ చద్దా ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ బెదిరింపులకు లొంగవద్దని సూచించారు. కొందరు నేతలు, ప్రత్యేక విధుల్లో ఉన్న అధికారులు బదిలీలు, సస్పెన్షన్‌లతో బెదిరిస్తున్నారని చెప్పారు. అయితే, పంజాబ్ ప్రభుత్వం కొన్ని నెలల అతిథి మాత్రమేనని, అధికారులు చట్టపరంగా, దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: ‘ఆప్’కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!
ఆగస్టు 6, 2026

Revanth Reddy | అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
ఆగస్టు 5, 2026

Saidabad Steel Bridge | సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నాహాలు.. పరిశీలించిన మంత్రులు
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్



