realme 16 5G | ఏఐ కెమెరాలతో లాంచ్ అయిన రియల్‌మి16 5జి స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
realme 16 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన నూతన స్మార్ట్ ఫోన్ రియల్‌మి 16 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో హై-రెజల్యూషన్ పోర్ట్రెట్ ఫోటోగ్రఫీ, భారీ బ్యాటరీ, లైట్‌వెయిట్ డిజైన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
Technology | Published On Apr 3, 2026, 3.00 pm IST
realme 16 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన నూతన స్మార్ట్ ఫోన్ రియల్‌మి 16 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో హై-రెజల్యూషన్ పోర్ట్రెట్ ఫోటోగ్రఫీ, భారీ బ్యాటరీ, లైట్‌వెయిట్ డిజైన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఫోన్‌లో వెనుక వైపు డ్యుయల్ 50 మెగాపిక్సల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫోటోగ్రఫీ, వీడియోల కోసం ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా ఇందులో ఇచ్చారు. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరాను అందించారు, ఇది సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా రియర్ సెల్ఫీ మిర్రర్‌ను ఇచ్చారు. దీంతో ప్రధాన కెమెరాతోనే సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే ఆరా రింగ్ ఫ్లాష్, వాయిస్ కౌంట్‌డౌన్, Say Hi వంటి హ్యాండ్స్-ఫ్రీ ఫీచర్లను ఇందులో ఇచ్చారు.
ఏఐ ఫీచర్లు..
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్‌లో ల్యూమాకలర్ ఇమేజ్ ఇంజిన్, వైబ్ మాస్టర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏఐ ఎడిట్ జీనీ ద్వారా ఏఐ ఇన్‌స్పిరేషన్, ఏఐ స్టైల్ మి, ఏఐ లైట్ మి వంటి ఎడిటింగ్ టూల్స్ ను అందుబాటులో ఉంచారు. వీడియోల కోసం ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ ఫీచర్ ను అందించారు. దీంతో ఫోటోలు, క్లిప్‌లను ఆటోమేటిక్‌గా చిన్న వీడియోలుగా రూపొందించుకోవచ్చు. ఈ ఫోన్ ను ఎయిర్ డిజైన్ కాన్సెప్ట్‌తో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ తక్కువ బరువు, సన్నని నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ మందం 8.1ఎంఎం కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది. ఈ ఫోన్‌లో 6.57 ఇంచుల డిస్‌ప్లే ను ఇచ్చారు. వెనుక వైపు ప్యానెల్‌కు యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ వెనుక వైపు వేలిముద్రలు పడవు.
భారీ బ్యాటరీ..
ఈ డివైస్‌లో 7000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 1600 చార్జింగ్ సైకిల్స్ తరువాత కూడా 80 శాతం హెల్త్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 60 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుంది. 100 శాతం చార్జింగ్ అయ్యేందుకు 74 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలియజేసింది. బైపాస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ అనే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బైపాస్ చార్జింగ్ అంటే ఫోన్‌కు చార్జర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు 100 శాతం చార్జింగ్ అవగానే బ్యాటరీ వినియోగాన్ని ఆపేస్తుంది. చార్జింగ్ కనెక్ట్ అయి ఉన్నంత వరకు ప్రధాన విద్యుత్ సరఫరాను వినియోగించుకునే ఫోన్ రన్ అవుతుంది. బ్యాటరీపై ఆధారపడదు. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇక రివర్స్ చార్జింగ్ ద్వారా ఈ ఫోన్ సహాయంతో ఇతర ఫోన్‌లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఐపీ66, 68, 69, 69కె డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
అద్భుతమైన డిస్‌ప్లే..
ఇందులో డిస్‌ప్లే అమోలెడ్ తరహాది కాగా దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలు తెరపై కనిపిస్తాయి. సూర్యకాంతిలోనూ స్పష్టంగా చూడగలిగేలా ఈ ఫోన్ డిస్‌ప్లేకు ఏకంగా 4200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ డిస్‌ప్లేకు డీటీ స్టార్ డిప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఉంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ధర వివరాలు..
రియల్‌మి16 5జి ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.31,999 ఉండగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.36,999గా ఉంది. ఈ ఫోన్‌ను పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. 15 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.1వేయి అదనపు బోనస్ ఇస్తారు. ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి ఇంకో ఏడాది అదనపు వారంటీ లభిస్తుంది. ఏదైనా ఓ గిఫ్ట్‌ను కూడా ఇస్తారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అన్ని రిటెయిల్ స్టోర్‌లలో ఏప్రిల్ 6 నుంచి విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



