త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Polls | అన్నామలైకి షాక్‌.. 27 మంది అభ్య‌ర్థుల జాబితాలో పేరు గ‌ల్లంతు..!

Tamil Nadu Polls | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ శుక్ర‌వారం 27 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు కే అన్నామ‌లై పేరు క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

P

National | Published On Apr 3, 2026, 3.03 pm IST

Tamil Nadu Polls | అన్నామలైకి షాక్‌.. 27 మంది అభ్య‌ర్థుల జాబితాలో పేరు గ‌ల్లంతు..!
Advertisement

Tamil Nadu Polls | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ శుక్ర‌వారం 27 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు కే అన్నామ‌లై పేరు క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ప్రధాన నియోజకవర్గాల్లో ఐదుగురు మహిళలకు పార్టీ అవకాశం కల్పించింది.

మ‌రోసారి ఎన్నిక‌ల బ‌రిలో త‌మిళిసై..

పుదుచ్చేరి మాజీ ఎల్‌జీ, తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిలై సౌంద‌ర‌రాజ‌న్‌ను మైలాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపింది. మోదక్కురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్, కోయంబత్తూరు ఉత్తరం నుంచి వనతి శ్రీనివాసన్, అరంతాంగి నుంచి క‌విత శ్రీకాంత్, విలవన్కోడ్ నుంచి ఎస్ విజయధ‌రణి పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్న స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దళిత ఓటర్లను ఆకర్షించే దిశగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రాసిపురం, అవినాశి, మనమదురై, వాసుదేవనల్లూరు వంటి స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ముఖ్యంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ను అవినాశి (ఎస్సీ రిజర్వ్) నుంచి బరిలోకి దింపడం గమనార్హం. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం.

అన్నామలై భవిష్యత్తు ప్ర‌శ్నార్ధ‌కం

తమిళనాడులో బీజేపీ పార్టీని విస్త‌రించ‌డంలో ఎంతో కృషి చేసిన మాజీ అధ్య‌క్షుడు అన్నామ‌లై పేరు జాబితాలో లేక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీలో ఆయన భవిష్యత్తు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అన్నామలై టికెట్లు పొందిన అభ్య‌ర్థుల‌కు ‘ఎక్స్’ ద్వారా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తగా తాను అందరితో క‌లిసి ప‌ని చేస్తాన‌ని తెలిపారు.

Advertisement
Advertisement