Artemis-2 | చందమామ దిశగా.. ఆర్టెమిస్-2 మిషన్
Artemis-2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ కీలక మైలురాయిని సాధించింది. ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక విజయవంతంగా భూమి కక్ష్యను దాటి చంద్రుడి దశగా ప్రయాణం ప్రారంభించింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మానవ రహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టినట్లయ్యింది.
Artemis-2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ కీలక మైలురాయిని సాధించింది. ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక విజయవంతంగా భూమి కక్ష్యను దాటి చంద్రుడి దశగా ప్రయాణం ప్రారంభించింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మానవ రహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ కీలకమైన “ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ బర్న్” ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో ప్రధాన ఇంజిన్‌ను సుమారు 5 నిమిషాలు 49 సెకన్ల పాటు మంచించి.. భూమి ఆకర్షణ శక్తి నుంచి బయటపడేలా చేశారు. ఈ సమయంలో దాదాపు 6వేల పౌండ్ల థ్రస్ట్ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుతం ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ కీలక దశకు ముందు మిషన్ మేనేజ్‌మెంట్ బృందం ఏకగ్రీవంగా “గో” సిగ్నల్ ఇచ్చింది.
బర్న్ విజయవంతంగా పూర్తికావడంతో 1972లో జరిగిన అపోలో-17 తర్వాత తొలిసారిగా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఈ విజయాన్ని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్‌మన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇక ఆర్టెమిస్-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు పాలు పంచుకున్నారు. ఇందులో క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్‌మన్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఉన్నారు. అంతరిక్షంలో తొలి రోజు వారంతా సాధారణ కార్యకలాపాలు నిర్వహించారు. ఇందులో ఇంజిన్ బర్న్‌కు సిద్ధం కావడం, మైక్రోగ్రావిటీలో శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు వ్యాయామాలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కీలక ఆపరేషన్ ప్రారంభానికి ముందు మిషన్ కంట్రోల్ సెంటర్‌లో “గ్రీన్ లైట్” పాటను వినిపిస్తూ సానుకూల వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం ఒరియన్ నౌకలోని సర్వీస్ మాడ్యూల్ ఇంజిన్ ఖచ్చితమైన వేగంతో నౌకను చంద్రుని వైపు మళ్లించింది. ఈ విజయంతో మానవ అంతరిక్ష యాత్రల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లేనని నాసా వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






