త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | ఢిల్లీ నుంచి బెంగాల్ వ‌ర‌కు.. 21కి చేరిన బీజేపీ పాలిత రాష్ట్రాలు..

BJP | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో బీజేపీ (BJP) జైత్ర‌యాత్ర అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతున్న‌ది. ప్రాంతీయ పార్టీల ఆధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని క్ర‌మంగా చేజిక్కించుకుంటున్న‌ది. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ (Congress) ప్ర‌స్తుతం నాలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైంది (కేర‌ళ‌తో క‌లిపి).

G

National | Published On May 4, 2026, 5.43 pm IST

BJP | ఢిల్లీ నుంచి బెంగాల్ వ‌ర‌కు.. 21కి చేరిన బీజేపీ పాలిత రాష్ట్రాలు..
Advertisement

BJP | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో బీజేపీ (BJP) జైత్ర‌యాత్ర అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతున్న‌ది. ప్రాంతీయ పార్టీల ఆధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని క్ర‌మంగా చేజిక్కించుకుంటున్న‌ది. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ (Congress) ప్ర‌స్తుతం నాలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైంది (కేర‌ళ‌తో క‌లిపి). ఇప్ప‌టికే ప‌ట్టు కోల్పోయిన వామ‌ప‌క్షాలు.. అధికారంలో ఉన్న ఒక్క‌ కేర‌ళ‌ను కూడా తాజా ఎన్నిక‌ల్లో ఓడిపోయాయి. ఇక మిగిలింది ఆప్‌, టీఎంసీ.. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న చీపురు పార్టీని ఇప్పుడు పంజాబ్‌కే ప‌రిమితం చేసింది. ఇక గ‌త ప‌దిహేనేండ్లుగా బెంగాల్‌లో అధికారం చెలాయిస్తున్న టీఎంసీని కూడా తాజాగా మ‌ట్టిక‌రిపించింది. దీంతో బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి చేరింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ ఒక మ్యాప్‌ను పోస్టు చేసింది. కాషాయం బెంగాల్‌కు చేరింది. ఇక భార‌త్ అంతా మోదీ మయం అంటూ పేర్కొంది.

`దేశ రాజ‌ధాని (ఢిల్లీ) నుంచి బెంగాల్ వరకు, ఈ విస్తరణ కేవలం భౌగోళిక చిత్రపటంలో వ్యాప్తి మాత్రమే కాదు. ఇది ప్రగతి పథంలో పయనించాలని దృఢంగా సంకల్పించిన ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు కొనసాగుతున్న‌ది. ఇప్పటికే వేగంగా సాగుతున్న ఒక బృహత్తర గాథలో బెంగాల్​ కేవలం ఒక సరికొత్త అధ్యాయం మాత్రమే. మనమందరం కలిసి 2047లోగా వికసిత్‌ భారత్‌ను నిర్మిద్దాం` అని అందులో రాసుకొచ్చింది.

21 రాష్ట్రాల్లో కాషాయ జెండా..

బెంగాల్ ఘ‌న విజ‌యంతో దేశంలో ఎన్డీఏ పాలన‌లో ఉన్న రాష్ట్రా సంఖ్య 21కి పెరిగింది. అందులో బీజేపీ సొంతంగా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇక బీహార్‌, నాగాలాండ్‌, మేఘాల‌య, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టింది. దేశంలో 29 రాష్ట్రాలు ఉండ‌గా.. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, కేర‌ళ‌, జార్ఖండ్‌, పంజాబ్, జమ్ముకశ్మీర్, మిజోరం, త‌మిళ‌నాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్​డీఏ కూట‌మి అధికారంలో కొనసాగుతున్న‌ది.

Advertisement
Advertisement