త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ ప‌థ‌కంలో చేరితే వ‌డ్డీనే రూ.5 ల‌క్ష‌లు ల‌భిస్తాయి..!

Post Office Time Deposit | పెట్టుబడిపై పూర్తి భద్రతతోపాటు ఆకర్షణీయమైన రాబడులు కోరుకునే వారికి పోస్టాఫీస్ ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (Time Deposit) స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ప్రభుత్వ హామీతోపాటు డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, కాలపరిమితి ఆధారంగా మంచి వడ్డీ ఆదాయం కూడా పొందవచ్చు.

S

Business | Published On Jun 20, 2026, 1.20 pm IST

Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ ప‌థ‌కంలో చేరితే వ‌డ్డీనే రూ.5 ల‌క్ష‌లు ల‌భిస్తాయి..!
Advertisement

Post Office Time Deposit | పెట్టుబడిపై పూర్తి భద్రతతోపాటు ఆకర్షణీయమైన రాబడులు కోరుకునే వారికి పోస్టాఫీస్ ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (Time Deposit) స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ప్రభుత్వ హామీతోపాటు డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, కాలపరిమితి ఆధారంగా మంచి వడ్డీ ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకంలో పెట్టిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. అందువల్ల పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉండదు. చిన్న మొత్తంతోనే ఖాతా ప్రారంభించే అవకాశం ఉండటంతోపాటు, పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో 1 సంవత్సరం, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం, 2 సంవత్సరాల డిపాజిట్‌పై 7 శాతం, 3 సంవత్సరాల డిపాజిట్‌పై 7.1 శాతం,5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.

రూ.12 ల‌క్ష‌ల‌ను పెడితే..

ఐదు సంవత్సరాల కాలానికి రూ.12 లక్షలను ఒకేసారి పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయానికి మొత్తం నిధి సుమారు రూ.17,39,938కు చేరుతుంది. ఇందులో వడ్డీ రూపంలోనే సుమారు రూ.5,39,938 ఆదాయం లభిస్తుంది. అంటే అసలు పెట్టుబడికి అదనంగా ఐదు లక్షల రూపాయలకు పైగా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. అదే రూ.4.5 లక్షలను ఐదు సంవత్సరాల పాటు ఈ పథకంలో ఉంచితే, మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.6,52,477 లభిస్తుంది. ఇందులో రూ.2,02,477 వరకు వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటుంది. మూడు సంవత్సరాల్లోనే రూ.2 లక్షలకు పైగా వడ్డీ సంపాదించాలని భావించే వారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. 7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం మూడు సంవత్సరాల తర్వాత మొత్తం నిధి సుమారు రూ.12,35,075కు చేరుతుంది. ఇందులో వడ్డీ రూపంలో రూ.2,35,075 వరకు ఆదాయం వస్తుంది.

ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు..

ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం పన్ను మినహాయింపు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద అర్హత కలిగిన పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం రూ.1వేయితో ఖాతా ప్రారంభించవచ్చు. వ్యక్తిగత ఖాతా లేదా జాయింట్ ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పరిమితిపై గరిష్ఠ పరిమితి లేకపోవడం మరో ప్రత్యేకత. సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఈ ప‌థ‌కం మంచి ఎంపిక అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement
Advertisement