Indian Railway | ప్రయాణికులకు రైల్వే షాక్.. జరిమానాలు భారీగా పెంపు
Indian Railway | భారతీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. తక్కువ ఖర్చు నేపథ్యంలో రైల్వేకు భారీగా డిమాండ్ ఉంటోంది. కొందరికి టికెట్లు దొరుకుతుండగా.. మరికొందరికీ అందుబాటులో లేకపోవడంతో టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా విధించే విషయం అందరికీ తెలిసిందే. త్వరలో టికెట్లు లేకుండా రాకపోకలు సాగించే ప్రయాణికులపై కొరడా ఝుళిపించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.
- రూల్స్‌ను మార్చిన రైల్వేబోర్డు
- ప్రయాణికులకు నిబంధనలు కఠినతరం
- రూ.500 పెరిగిన జరిమానా
Indian Railway | భారతీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. తక్కువ ఖర్చు నేపథ్యంలో రైల్వేకు భారీగా డిమాండ్ ఉంటోంది. కొందరికి టికెట్లు దొరుకుతుండగా.. మరికొందరికీ అందుబాటులో లేకపోవడంతో టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా విధించే విషయం అందరికీ తెలిసిందే. త్వరలో టికెట్లు లేకుండా రాకపోకలు సాగించే ప్రయాణికులపై కొరడా ఝుళిపించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇప్పటి వరకు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే పూర్తి టికెట్ చార్జీతో పాటు అదనంగా రూ.250 జరిమానా విధించేవారు. తాజాగా కొత్త విధానం ప్రకారం ఈ జరిమానాను రూ.500కి పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు జులై ఒకటి నుంచి అమలులోకి రానున్నది.
దాదాపు 13ఏళ్ల తర్వాత జరిమానాను సరించింది. గతంలో 2013లో జరిమానా రూ.50 ఉండగా దాన్ని రూ.250కి పెంచిన విషయం తెలిసిందే. అలాగే, ఇతరుల పేరుతో బుక్ చేసిన టికెట్‌తో ప్రయాణిస్తే ఆ టికెట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తి ఛార్జ్, అదనంగా రూ.500 జరిమానా విధించనున్నారు. మహిళల బోగీలో ఎక్కిన వారికి గరిష్టంగా రూ.2500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. జరిమానా కట్టలేకపోతే కేసును కోర్టుకు పంపనున్నారు. అలాంటి పక్షంలో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఛాన్స్ కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కొత్త నిబంధనలు పబ్లిక్ ట్రస్ట్ చట్టం కింద అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. టికెట్ లేకుండా ప్రయాణించడం, టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని జోనల్ రైల్వేలకు ఈ నిబంధనలను సిబ్బందికి వివరించి కఠినంగా అమలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
మత్తులో రైలు, స్టేషన్లలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే ప్రయాణంలో మధ్యలోనే రైలు నుంచి దించివేయడం, జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. లైసెన్స్ లేకుండా హాకింగ్, భిక్షాటన చేస్తే రూ.2వేలు జరిమానా విధించనున్నారు. నిషేధిత వస్తువులు తీసుకెళ్లిన వారికి గరిష్టంగా రూ.10వేల వరకు జరిమానా విధించనున్నారు. అనధికారికంగా స్టేషన్, రైలులో ప్రవేశిస్తే రూ.500 జరిమానా పడనుంది. మత్తులో అల్లర్లకు పాల్పడితే 24 గంటల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ విధించే అవకాశం ఉంది. ప్రయాణికులను వేధించడం, అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.1,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- ●Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!
- ●Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
- ●RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Air Force One | అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
- ●Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం..

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు

Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!

Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్






