RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్
RS Praveen Kumar | యావత్ తెలంగాణ రాష్టాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భాదితురాలు, ఆమె తల్లికి ఏ మాత్రం సహకరించడం లేదని తెలిసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఏ అధికారి తప్పు చేసినా, బాధితురాలికి అన్యాయం చేసినా BRS 2.0 లో మొదటి రోజే సస్పెండ్, ఆ తరువాత డిస్మిస్ అవ్వడం ఖాయమన్నారు.
- భగీరథ్ కేసు పురోగతి వివరాలను బాధిత కుటుంబానికి ఎందుకివ్వలే
- సంజయ్, సంగప్పలను A2, A3 లుగా ఎందుకు చేర్చలేదు?
- సీఎం రేవంత్ మిత్ర ధర్మాన్ని పాటించినందుకు కంగ్రాట్స్
- చర్లపల్లి జైలు నుండి ఫార్చూనర్ కారులో వారు దర్జాగా ఇంటికెళ్లిపోయారు
- మహిళల, బాలికల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉందని ఇంకా నమ్ముదామా?
- ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: యావత్ తెలంగాణ రాష్టాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భాదితురాలు, ఆమె తల్లికి ఏ మాత్రం సహకరించడం లేదని తెలిసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇందులో ఏ అధికారి తప్పు చేసినా, బాధితురాలికి అన్యాయం చేసినా BRS 2.0 లో మొదటి రోజే సస్పెండ్, ఆ తరువాత డిస్మిస్ అవ్వడం ఖాయమన్నారు. అనుమానం ఉంటే పక్కన ఆంధ్ర పోలీసులను అడగండని హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి ఈ విషయాలన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి. ఆమె భయాలను, మనోభావాలను ట్రయల్ కోర్టుకు తెలియజేయాలి. ఆ తరువాతే బెయిల్ గురించి ఆలోచించాలి. ఇంతవరకు కేసు పురోగతి గురించి ఏ పోలీసు అధికారి, పీపీ గానీ బాధిత కుటుంబానికి తెలియజేయలేదు. ఇప్పటివరకు నమోదు చేసిన సాక్ష్యాల ప్రతులను కూడా ఇవ్వలేదు. బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్, సంగప్పలను A2, A3 లుగా ఈరోజు వరకు కూడా ఎందుకు చేర్చలేదు? ఇంతవరకు చార్జ్‌షీట్ వేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పండి.
మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు. కంగ్రాట్స్. కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్ పోలీసులు, ప్రాసిక్యూటర్‌లు నిందితుడి బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం. ఇవాళ ఉదయం ఫార్చూనర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్లిపోయారు. తెలంగాణ మహిళలారా, బాలికలారా, ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా? అని ప్రవీణ్‌కుమార్ ఉపదేశించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?
- ●Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్
- ●Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం
- ●Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- ●Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!
- ●Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?

Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్

Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు




