త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బ‌ట్ట‌లిప్పి ప‌రుగెత్తిస్తా: మైనంప‌ల్లి తీవ్ర వ్యాఖ్య‌లు

Mynampally Hanumanth Rao | కేటీఆర్ ఏదైనా స‌వాల్ చేసే ముందు ఫ‌స్ట్ మీసాలు పెంచుకోవాల‌ని.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ముందు ముందు చాలా సినిమాలు చూపిస్తాన‌ని మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి మైనంపల్లి హ‌న్మంత‌రావు హెచ్చ‌రించారు. మేం రౌడీయిజం చేసేటోళ్లం కాద‌ని, రౌడీల‌కు బుద్ధిచెప్పేటోళ్ల‌మ‌న్నారు.

S

Telangana | Published On Jun 20, 2026, 1.35 pm IST

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బ‌ట్ట‌లిప్పి ప‌రుగెత్తిస్తా: మైనంప‌ల్లి తీవ్ర వ్యాఖ్య‌లు
Advertisement
  • స‌వాల్ చేసేట‌ప్పుడు ఫ‌స్ట్ మీసాలు పెంచుకో
  • నువ్ పాద‌యాత్ర చేస్తే శెక్కరొచ్చి ప‌డిపోత‌వ్‌
  • మేం రౌడీల‌కు బుద్ది చెప్పేటోళ్లం
  • ద‌ళితుల‌ను సంసారానికి ప‌నికిరాకుండా చేసిన ఘ‌న‌త నీకే ద‌క్కిందిరాబై
  • కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన మైనంపల్లి హ‌న్మంత‌రావు

Mynampally Hanumanth Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్ ఏదైనా స‌వాల్ చేసే ముందు ఫ‌స్ట్ మీసాలు పెంచుకోవాల‌ని.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ముందు ముందు చాలా సినిమాలు చూపిస్తాన‌ని మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి మైనంపల్లి హ‌న్మంత‌రావు హెచ్చ‌రించారు. శ‌నివారం ఆయ‌న గాంధీ భవన్‍లో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మేం రౌడీయిజం చేసేటోళ్లం కాద‌ని, రౌడీల‌కు బుద్ధిచెప్పేటోళ్ల‌మ‌న్నారు. మీ మీద హీరోయిజం చేస్త‌మ‌న్నారు. ఫోన్ ట్యాపింగ్‌లు చేయ‌డ‌మే కాకుండా చాలా మంది సెల‌బ్రిటీల జీవితాల‌ను నాశ‌నం చేశార‌ని ఆరోపించారు.

కేకే మ‌హేంద‌ర్‌రెడ్డి నోట్లె మ‌న్ను పోసిన‌వ్‌..

ఏం చేత‌గాదు. ఒక పాద‌యాత్ర చేయ‌మ‌ను. ద‌మ్మొస్త‌ది.. షుగ‌ర్ వ‌స్త‌ది చ‌క్కెరొచ్చి ప‌డిపోత‌డు. మైనంప‌ల్లి అన్ని చేస్త‌డు. నేను మాట్లాడా.. చేత‌ల‌ల్ల చూపిస్తా. నేను రౌడీయిజం చేసేటోన్ని కాదు. రౌడీల‌కు బుద్ధి చెప్పేటోళ్లం. మీ మీద హీరోయిజం చేస్తా. శ‌వాల మీద ప్యాలాలు ఏరుకొనే రకం కేటీఆర్‌. ఒక్క రోజ‌న్నా ఉద్య‌మం చేసినావ్‌రా బై. కేకే మ‌హేంద‌ర్‌రెడ్డి అనే ఉద్య‌మ‌కారుని నోట్లే మ‌న్ను పోసిన‌వ్‌. ఆనాడు ఎన్నిక‌ల్ల 300 ఓట్ల‌తోటి గెలిచిండు. ఇది గొప్ప‌త‌న‌మా? ఇన ప‌డ‌గొట్టింది ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్‌లు చేసుడు. సెల‌బ్రిటీల జీవితాల‌ను నాశ‌నం చేసుడు. ఇలా ఎన్నో కుటుంబాల‌ను నాశ‌నం చేసిండు. నీ చ‌రిత్ర ఇదేరాబై అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఏం పీక్త‌వ్ నువ్‌..

స‌వాల్ విసిరేట‌ప్పుడు ఫ‌స్ట్ మీసాలు పెంచుకో నువ్. చాలా మాట్లాడుతున్న‌వ్‌. నిన్న ఓట‌ర్ అవేర్‌నెస్ ప్రోగ్రాం కోసం మ‌ల్కాజిగిరికి వ‌చ్చిన‌వ్‌. ఈ ప్రోగ్రాంలో నేన్ పీక్తా ఏక్తా అని మ‌ట్లాడుడు ఎంతవ‌ర‌కు క‌రెక్టో తెల్వ‌దు. ఏం పీక్త‌వు నువ్‌. అల్వాల్‌కు వ‌చ్చి ఉంటా అంటున్న‌వ్‌. సిరిసిల్ల‌కు మాకు రారాదా? అడ్వ‌కేట్ కుటుంబాన్ని మిట్ట మ‌ధ్యాహ్నం మంథ‌నీలో న‌రికి సంపిన ఘ‌న‌త నీ పార్టీకి ద‌క్కింది. సిరిసిల్ల‌ల‌ వేల కోట్ల రూపాయ‌ల ఇసుక మాఫియా చేసిన‌వ్‌రాబై.. 8 మంది ద‌ళితుల‌ను వాళ్ల సంసారానికి ప‌నికి రాకుండా థ‌ర్డ్ డిగ్రీ ఇప్పిచ్చిన ఘ‌న‌త నీకే ద‌క్కిందిరాబై అని త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

దొంగ‌ల‌కైనా మినిమం ఎథిక్స్ ఉంట‌య్‌..

విపక్షంలోనూ అట్టర్ ప్లాప్ అయ్యారు. ప్రతిదానికి ఎందుకు అంతలా ఉలిక్కిపడుతున్నావ్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పనులను అడ్డుకోవమే కేటీఆర్, హరీశ్ రావు పని‍గా పెట్టుకున్నారు. కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు.. దండుపాళ్యం బ్యాచ్, స్టూవర్టుపురం దొంగలకైనా మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లి, బావ, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. మంత్రి హోదాలో గన్‌మెన్లు ఎవరూ లేకుండా అర్ధ‌రాత్రి ఒంటరిగా వెళ్తుండగా అప్పా జెంక్షన్‍లో ముఖానికి మాస్క్ పెట్టుకుని దొరికిన ఘనత కేటీఆర్ ది. అదే మేం తలుచుకుంటే ఒక్క రోజు కూడా నిద్రపోలేవ్‌. ఇంగ్లీశ్ మాట్లాడటంలో కేటీఆర్ తనకు తానే తోపు అనుకుంటున్నాడు. కానీ మెజారిటీ మంత్రుల్లో ఆయనకంటే మంచి ఇంగ్లీశ్ మాట్లాడేవారు ఉన్నారు అని మైనంప‌ల్లి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement