OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే – ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
ఈ వారం క్రైమ్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ కథాంశాలతో కూడిన పలు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. సూర్య కరుప్పు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా... మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్రీదం జియో హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Entertainment | Published On Jun 12, 2026, 5.16 pm IST
OTT | ఈ శుక్రవారం (నేడు) ఒక్క రోజే తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడ భాషలకు చెందిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. థ్రిల్లర్, హారర్, క్రైమ్ జానర్స్ కూడిన ఆ సినిమాలు ఏవంటే?
సూర్య కరుప్పు
సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ కరుప్పు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. కోర్టులోని జరుగుతోన్న అన్యాయాలపై వీరభద్రుడు ఎలాంటి పోరాటం సాగించాడనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
రమణీ కళ్యాణం
తెలుగు మూవీ రమణీ కళ్యాణం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో దీప్షికా చంద్రన్, సూర్య వశిష్ట జంటగా కనిపించారు. అంధురాలైన యువతికి, ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన యువకుడికి మధ్య ప్రేమకథతో డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
ద్రీదం
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్రీదం జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఎలాంటి క్లూ లేని మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు అన్నదే ఈ మూవీ కథ. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ మూవీకి మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
కన్నడ మూవీ
పీలి - మలయాళం మూవీ - మనోరమా మ్యాక్స్ ఓటీటీ
పెద్ద పిట్ట - తెలుగు మూవీ - ఈటీవీ విన్
వికల్ప- కన్నడ మూవీ - జీ5 ఓటీటీ
నాను కరుణాకర - కన్నడ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో
పొంగల - మలయాళం మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో
అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా - హిందీ మూవీ - నెట్‌ఫ్లిక్స్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే – వీటిని మిస్సవ్వొద్దు…
జూన్ 5, 2026

Telugu OTT | గత వారం థియేటర్లలో….ఈ వారం ఓటీటీలో – అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
జూన్ 4, 2026

Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ కామెడీ మూవీ
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
- ●Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
- ●Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..
- ●Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు
- ●Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్
- ●TG ICET 2026 | టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు

Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!

Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు



