Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.11.82 కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్.. మోడల్ అరెస్ట్
Model Arrested | కేరళంకు చెందిన 28 ఏళ్ల మోడల్ హర్ష సన్నీ (Harsha Sunny) బ్యాంకాక్ నుంచి రూ.కోట్ల విలువ చేసే హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని (hydroponic marijuana) స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది (Model Arrested).
Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.కోట్ల విలువ చేసే హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని (hydroponic marijuana) స్మగ్లింగ్ చేస్తూ ఓ మోడల్ (Model) అడ్డంగా దొరికిపోయింది (Model Arrested). ఎయిర్‌పోర్టు నుంచి ఏకంగా జైలుకెళ్లింది. ఈ ఘటన ముంబై (Bangkok To Mumbai) ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కేరళంకు చెందిన 28 ఏళ్ల మోడల్ హర్ష సన్నీ (Harsha Sunny) ఈనెల 10-11 రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు సన్నీని అడ్డుకున్నారు. ఆమె ట్రాలీ బ్యాగ్‌ని చెక్ చేయగా.. ఆ బ్యాగులో ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు కనిపించాయి. అందులో పచ్చటి పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కిట్ ఉపయోగించి అక్కడికక్కడే కెమికల్ టెస్ట్ చేయగా.. అది హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ అని తేలింది.
పట్టుబడిన గంజాయి 11 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాని విలువ సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు నిషేధిత మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినందుకు గానూ కస్టమ్స్ అధికారులు హర్ష సన్నీని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ డ్రగ్స్‌ను ఆమె ఎవరికి డెలివరీ చేసేందుకు తీసుకొచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హర్ష సన్నీ 2025లో జరిగిన మిసెస్ కేరళ పోటీదారు (Mrs Kerala 2025 contestant) కావడం గమనార్హం.
Also Read..
షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
తాజావార్తలు
- ●Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
- ●OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
- ●KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి

Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!

OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్

KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో



