KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి రూ. 200 కోట్లతో రాజసౌధం కట్టుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ ఎత్తున కోటగోడలు కట్టి ఒక రాజప్రసాదం నిర్మాణం చేసుకున్నాడు. సీఎం రాజప్రసాదానికి సంబంధించి నిర్మాణ జీవోలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారు. తప్పు చేయకుంటే ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి రూ. 200 కోట్లతో రాజసౌధం కట్టుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ ఎత్తున కోటగోడలు కట్టి ఒక రాజప్రసాదం నిర్మాణం చేసుకున్నాడు. సీఎం రాజప్రసాదానికి సంబంధించి నిర్మాణ జీవోలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారు. తప్పు చేయకుంటే ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అమ్ముతున్న భూముల నుంచి వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలి. రూ. 4 లక్షల కోట్ల అప్పు తీసుకువచ్చి వాటిని ఎక్కడ పంపిందో చెప్పాలి. ఒకవైపు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పక్కన పెట్టింది. కొత్తగా పెన్షన్లు, హామీలు అమలు చేయడం లేదు. కానీ కొత్త హెలికాప్టర్లు కొని సీఎం సోకులు పడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
అర్ధరాత్రి సీఎం ఇంటి గృహప్రవేశం ఎందుకు చేసుకున్నారో..?
అర్ధరాత్రి సీఎం ఇంటి గృహప్రవేశం ఎందుకు చేసుకున్నారో చెప్పాలి. నిజంగానే అందులో తప్పు చేయకుంటే, రహస్యం లేకుంటే మీడియాను తీసుకువెళ్లి చూపించాలి. గతంలో ప్రగతి భవన్ పైన "బంగారు కిటికీలు" అంటూ, "బాత్రూమ్‌లు" అంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.
సచివాలయం ఎందుకు వాడుతున్నాడు?
ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి తీసుకొచ్చి సాధించింది ఏమీ లేదు కానీ మూడు మూడు ఇండ్లు కట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎం సైతం హైదరాబాద్, ఖమ్మం, మధిరలో భారీ ఇండ్లు కట్టుకుంటున్నారు. నిజంగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం ఎందుకు వాడుతున్నాడు? అని కేటీఆర్ నిలదీశారు.
ఒక్కరికైనా రూ. 2.5 లక్షలు అందాయా..?
లక్ష కోట్ల రూపాయల భూములు అమ్మి వాటిని ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ. 2.5 లక్షలు ఇస్తామని చెప్పారు, మరి అలాంటి కుటుంబం ఒకటైనా ఉన్నదా రాష్ట్రంలో? ఒక్కరికైనా రూ. 2.5 లక్షలు అందాయా చెప్పాలి. ఉన్న పథకాలు అమలు చేస్తే చాలు, కానీ ఉన్న పథకాలను కూడా ఆపి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో ఏం చేస్తుందో క్లారిటీ లేదు
యువతలో నిరాశా నిస్పృహలు ఉంటే తిరుగుబాటు తప్పదని గతంలో చెప్పాం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఆన్‌లైన్‌లో అదే స్పందన కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో ఏం చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు అని కేటీఆర్ అన్నారు.
స్తంభించిన రియల్ ఎస్టేట్.. లక్షల మంది ఉపాధికి ప్రమాదం
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది. మా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటి నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి రెండు మూడు సంవత్సరాల తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ల రూపంలో తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోవడంతోనే లక్షల మంది ఉపాధికి తీవ్రమైన గండి కొట్టింది అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
- ●Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
- ●Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
- ●Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..
- ●Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు
- ●Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్
- ●TG ICET 2026 | టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు

Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!

Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు





