Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
Kane Williamson | న్యూజిలాండ్ క్రికెట్‌కు దశాబ్దానికిపైగా వెన్నెముకలా నిలిచిన కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా తనదైన ముద్రవేసిన కేన్ మామ.. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.
Kane Williamson | న్యూజిలాండ్ క్రికెట్‌కు దశాబ్దానికిపైగా వెన్నెముకలా నిలిచిన కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా తనదైన ముద్రవేసిన కేన్ మామ.. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో కివీ జట్టు ఓటమిపాలైంది. రెండో టెస్టు ఈ నెల 17 నుంచి మొదలుకానుండగా.. ఈ క్రమంలోనే 35 ఏళ్ల విలియమ్సన్ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. టెస్ట్ సిరీస్‌లో మిగతా మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. కేన్ స్థానంలో మరో బ్యాట్స్‌మెన్‌ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించే అవకాశం ఉంది.
“ఇది చాలా కాలంగా ఆలోచిస్తున్న నిర్ణయం. గత కొన్ని రోజులుగా మరింత స్పష్టత వచ్చింది. ప్రతి మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున నా శక్తి మేరకు ఆడాను. ఇప్పుడు అదే స్థాయిలో కొనసాగలేనని అనిపిస్తే ఆడడం సరికాదు. అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నాను” అని విలియమ్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. “జట్టు భవిష్యత్తుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ జట్టుతో గడిపిన ప్రతి క్షణం నాకు అమూల్యమైంది. ఈ జట్టు ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది” అని పేర్కొన్నాడు.
విలియమ్సన్ తన కెరీర్‌లో మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 19,346 పరుగులు చేశాడు. ఇందులో 48 శతకాలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో కేన్ ఒకడు. 2016 నుంచి 2024 వరకు అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించిన విలియమ్సన్.. జట్టును విజయాల బాటలో నడిపించాడు. అతని కెప్టెన్సీలో న్యూజిలాండ్ రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్, మూడుసార్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. 2021లో జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. గత ఏడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విలియమ్సన్, తాజాగా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
విలియమ్సన్ నిర్ణయంపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందించారు. కేన్ ప్రభావం గణాంకాలకు మించినదని వాల్టర్ పేర్కొన్నారు. “కేన్‌తో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ఎంత ప్రత్యేక వ్యక్తి అనేది తెలుసు. జట్టు సంస్కృతి, ప్రమాణాలను ఆయన ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. అద్భుతమైన ఆటగాడు, గొప్ప నాయకుడు, అద్భుతమైన అంబాసిడర్” అని వాల్టర్ ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. తన అద్భుతమైన ఆటకు గాను విలిమ్సన్ పలు ఐసీసీ అవార్డులను అందుకున్నాడు. 2015లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2019లో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న ఆయన, నాలుగుసార్లు సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ గెలుచుకుని అరుదైన ఘనత సాధించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
జూన్ 12, 2026

Madras High Court | కూలాలకతీతంగా ఓటేయగలమని తమిళ ప్రజలు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు
జూన్ 12, 2026

Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి.. సివిల్ సర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్యలు..!
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
- ●KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్

OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్

KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్



