Rahul Gandhi | విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి : రాహుల్ గాంధీ
Rahul Gandhi | విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై ప్రధాని (PM Modi)ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi | కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన మార్చ్ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన నిరసనకారులు ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని రాహుల్, ప్రియాంక గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "ప్రధానమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారు..? పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థులకు ఆయన క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై పోలీసుల చర్యలను ఆపాలి" అని గాంధీ అన్నారు. మరోవైపు విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనలపై లోక్‌సభలో చర్చ జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తు గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకు విద్యార్థులను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు చెప్పారు.
"ఈరోజు ప్రతిపక్ష ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్‌ను కలిశాను. నిన్న విద్యార్థులపై జరిగిన దారుణంపై, పరీక్షల సంక్షోభం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం జవాబుదారీతనం లేకపోవడంపై పార్లమెంట్‌లో కూలంకషంగా చర్చ జరగాలని డిమాండ్ చేశాం" అని రాహుల్ అన్నారు. యువత భవిష్యత్తు గురించి పార్లమెంట్‌లో చర్చించకపోతే ఎలా..? అని ప్రశ్నించారు.
Also Read..
షూటింగ్‌లో గాయపడ్డ బాలకృష్ణ - అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ - లెజెండ్, లయన్‌లో ఇలాగే....
తొలి క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టిన శాంసంగ్.. ఫీచర్లు ఇవే..
సంబంధిత వార్తలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
జులై 28, 2026

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
జులై 28, 2026

AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
జులై 27, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..

Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా



