త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy Card | తొలి క్రెడిట్ కార్డ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు ఇవే..

Samsung Galaxy Card | స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తొలి క్రెడిట్ కార్డ్ శాంసంగ్ గెలాక్సీ కార్డ్ ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ కొనుగోళ్లతోపాటు శాంసంగ్ ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్ రివార్డ్స్, ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను అందించేలా రూపొందించిన ఈ కార్డ్, మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న యాపిల్ కార్డ్ కు నేరుగా పోటీ ఇవ్వ‌నుంది.

S

Business | Published On Jul 21, 2026, 2.30 pm IST

Samsung Galaxy Card | తొలి క్రెడిట్ కార్డ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు ఇవే..
Advertisement

Samsung Galaxy Card | స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తొలి క్రెడిట్ కార్డ్ శాంసంగ్ గెలాక్సీ కార్డ్ ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ కొనుగోళ్లతోపాటు శాంసంగ్ ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్ రివార్డ్స్, ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను అందించేలా రూపొందించిన ఈ కార్డ్, మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న యాపిల్ కార్డ్ కు నేరుగా పోటీ ఇవ్వ‌నుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ను బార్క్లేస్ యూఎస్ కన్స్యూమర్ బ్యాంక్ వీసా నెట్‌వర్క్‌పై జారీ చేస్తోంది. వినియోగదారులకు ఇది వర్చువల్ కార్డ్ రూపంలో అందుబాటులో ఉండటంతోపాటు, నలుపు రంగు శాంసంగ్ లోగోతో కూడిన ప్రీమియం మెటల్ ఫిజికల్ కార్డ్ రూపంలో కూడా లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ కార్డ్ నేరుగా శాంసంగ్ వాలెట్ తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులకు పలు స్థాయిల్లో క్యాష్ రివార్డ్స్ అందిస్తారు.

క్యాష్ రివార్డ్స్‌, త‌గ్గింపు ధ‌ర‌లు..

శాంసంగ్ నుంచి నేరుగా అర్హత ఉన్న ఉత్పత్తులు కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ రివార్డ్స్ లభిస్తాయి. శాంసంగ్ వాలెట్ ద్వారా చేసిన కొనుగోళ్లపై 3 శాతం క్యాష్ రివార్డ్స్ అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, స్పాటిఫై వంటి ఎంపిక చేసిన స్ట్రీమింగ్ సేవలపై 2 శాతం క్యాష్ రివార్డ్స్ లభిస్తాయి. ఇతర సాధారణ కొనుగోళ్లన్నింటిపైనా 1 శాతం క్యాష్ రివార్డ్స్ పొందవచ్చు. క్యాష్ రివార్డ్స్‌తో పాటు కార్డ్ హోల్డర్లకు శాంసంగ్ వీఐపీ అడ్వాంటేజ్ మెంబర్‌షిప్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ఆ మెంబర్‌షిప్ కొనుగోలు లేదా రెన్యూవల్ సమయంలో కూడా అదనంగా 5 శాతం క్యాష్ రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అర్హత ఉన్న వినియోగదారుల కోసం ఎర్లీ యాక్సెస్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. సాధారణ ప్రజలకు దరఖాస్తుల స్వీకరణ బుధ‌వారం నుంచి ప్రారంభమవుతుంది. అమెరికాలోని శాంసంగ్ రిటైల్ స్టోర్లతోపాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీగా ప్ర‌యోజ‌నాలు..

కొత్తగా కార్డ్ తీసుకునే వారికి ప్రత్యేక వెల్కమ్ బోనస్ కూడా ప్రకటించింది. అకౌంట్ ప్రారంభించిన తొలి 90 రోజుల్లో 2వేల డాలర్లు ఖర్చు చేస్తే అదనంగా 200 డాలర్ల క్యాష్ రివార్డ్స్ అందిస్తారు. ఎర్లీ రిజర్వేషన్ చేసుకున్న వినియోగదారులకు ప్రీ-ఆర్డర్ సమయంలో 30 డాలర్ల శాంసంగ్ క్రెడిట్ కూడా లభిస్తుంది. వివిధ ప్రమోషనల్ ఆఫర్లను కలిపి గరిష్ఠంగా 1,230 డాలర్ల వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. అలాగే దరఖాస్తు చేసిన వారికి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఉపయోగించుకునే 500 డాలర్ల గిఫ్ట్ కార్డులను గెలుచుకునే స్వీప్‌స్టేక్స్‌లో కూడా అవకాశం కల్పిస్తోంది. మొత్తం పది మందిని విజేతలుగా ఎంపిక చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ కార్డ్ పూర్తిగా శాంసంగ్ వాలెట్ ఎకోసిస్టమ్‌లో పనిచేస్తుంది. ఒకే యాప్‌లో చెల్లింపు కార్డులు, డిజిటల్ ఐడీలు, పాస్‌లు, డిజిటల్ కీలు వంటి వాటిని నిర్వహించుకునే వీలుంటుంది. భద్రత కోసం శాంసంగ్ తన డిఫెన్స్-గ్రేడ్ మొబైల్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ నాక్స్ ను ఉపయోగిస్తోంది. దీంతో వినియోగదారుల లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అయితే ఇత‌ర దేశాల్లో ఉన్న వినియోగ‌దారుల‌కు ఈ కార్డును ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది వెల్ల‌డించ‌లేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement