Balakrishna | షూటింగ్‌లో గాయపడ్డ బాలకృష్ణ – అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ – లెజెండ్, లయన్‌లో ఇలాగే….
ఎన్‌బీకే 111 షూటింగ్‌లో హీరో బాలకృష్ణ గాయపడ్డారు. బాలకృష్ణ, మంచు మనోజ్‌లపై కాకినాడ పోర్ట్ ఏరియాలో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో జారిపడటంతో బాలకృష్ణ మోకాలికి దెబ్బ తగిలింది. ఈ ప్రమాదంపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణకు ఓ సర్జరీ జరుగబోతున్నట్లు వెల్లడించారు.
Entertainment | Published On Jul 21, 2026, 2.39 pm IST
Balakrishna | ఎన్‌బీకే 111 షూటింగ్‌లో హీరో బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ ద్వారా దర్శకుడు గోపీచంద్ మలినేని అప్‌డేట్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఎన్‌బీకే 111 షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ ఏరియాలో జరుగుతోంది. హీరో బాలకృష్ణతో పాటు విలన్‌గా నటిస్తోన్న మంచు మనోజ్‌పై దర్శకుడు ఓ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతోన్న సమయంలో బాలకృష్ణ జారిపడటంతో ఆయన మోకాలికి దెబ్బ తగిలింది. కాలి మెలిక పడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాంతో చిత్రీకరణను నిలిపివేసిన మేకర్స్ బాలకృష్ణను చికిత్స కోసం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది.
అప్‌డేట్...
బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ గోపీచంద్ మలినేని అప్‌డేట్ ఇచ్చారు. "అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోండగా ప్రమాదం జరిగింది. ఆయన కోలుకోవడానికి చిన్న సర్జరీ చేయాల్సివుంటుందని వైద్యులు తెలిపారు. తొందరలోనే బాలకృష్ణ కోలుకొని తిరిగి షూటింగ్‌లో జాయిన్ అవుతారు" అని గోపీచంద్ మలినేని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గతంలో లయన్, లెజెండ్‌తో పాటు సుల్తాన్ సినిమా షూటింగ్‌లలో కూడా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తోండగా బాలకృష్ణ గాయపడ్డారు.
కాజల్ అగర్వాల్....
ఎన్‌బీకే 111 మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. జీ5 ఓటీటీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు – బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
జులై 10, 2026

Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా – స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని
జూన్ 25, 2026

Mahesh Babu Sister | బాలకృష్ణ హీరో – మహేష్‌బాబు అక్క హీరోయిన్ – ఫ్యాన్స్ గొడవలతో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?
జూన్ 21, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..



