Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
Aadhaar | ఆధార్ కార్డు ప్రస్తుతం అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. చిన్న పని నుంచి పెద్ద పని వరకు దాదాపు ప్రతి అవసరానికీ ఆధార్ ను వినియోగిస్తున్నారు. ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతోపాటు వేలిముద్రలు (ఫింగర్‌ప్రింట్‌లు), ఐరిస్ వివరాలు కూడా నమోదై ఉంటాయి.
Aadhaar | ఆధార్ కార్డు ప్రస్తుతం అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. చిన్న పని నుంచి పెద్ద పని వరకు దాదాపు ప్రతి అవసరానికీ ఆధార్ ను వినియోగిస్తున్నారు. ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతోపాటు వేలిముద్రలు (ఫింగర్‌ప్రింట్‌లు), ఐరిస్ వివరాలు కూడా నమోదై ఉంటాయి. ఈ సున్నితమైన బయోమెట్రిక్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా రక్షించేందుకు యూఐడీఏఐ బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్ హోల్డర్లు తమ బయోమెట్రిక్ వివరాలను అవసరమైనప్పుడు లాక్ చేయడం, మళ్లీ అన్‌లాక్ చేయడం సులభంగా చేయవచ్చు. బయోమెట్రిక్ లాక్ అంటే ఆధార్ హోల్డర్ల ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫేస్ అథెంటికేషన్‌ను రక్షించే భద్రతా ఫీచర్. ఒకసారి బయోమెట్రిక్ లాక్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఎవరూ బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయలేరు. లాక్ చేసిన సమయంలో ఎవరైనా అథెంటికేషన్ కు ప్రయత్నిస్తే అది విఫలమవుతుంది. దీంతో మీ బయోమెట్రిక్ సమాచారానికి అదనపు భద్రత లభిస్తుంది.
ఎలా లాక్, అన్‌లాక్ చేయాలి..
కొత్త ఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలంటే ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి, 6 అంకెల పిన్ నమోదు చేసి లాగిన్ కావాలి. హోమ్ స్క్రీన్‌లో కనిపించే బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. అనంతరం బయోమెట్రిక్ లాక్‌ను ధ్రువీకరించాలి. దీంతో మీ ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫేస్ అథెంటికేషన్ పూర్తిగా లాక్ అవుతాయి. అదే విధంగా బయోమెట్రిక్ అన్‌లాక్ చేయాలంటే ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్‌లాక్‌ను ధ్రువీకరిస్తే మీ బయోమెట్రిక్ వివరాలు మళ్లీ వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అవసరమైన పని పూర్తయిన వెంటనే భద్రత కోసం తిరిగి బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం మంచిది.
విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్రజలు..
హోమ్ స్క్రీన్‌లో బయోమెట్రిక్ లాక్ ఆప్షన్ కనిపించకపోతే, యాప్‌లోని సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్త ఆధార్ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్లకు పైగా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఫీచర్‌ను 1.91 కోట్లకు పైగా సార్లు వినియోగించారు. ఈ గణాంకాలు కొత్త ఆధార్ యాప్‌తో పాటు ఈ భద్రతా ఫీచర్‌ను ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు సూచిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
సెప్టెంబర్ 22, 2026

Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
ఆగస్టు 27, 2026

Telecom Rules 2026 | కొత్త సిమ్ కార్డుకు బయోమెట్రిక్ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



