త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Molest | ‘ప‌ది’లో ప‌రిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగిక‌దాడి

Woman Molest | ఆమెకు అత‌ను ప‌దో త‌ర‌గ‌తిలో ప‌రిచ‌య‌డం అయ్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్త రోజుకు ఒక‌ట్రెండు సార్లైనా మాట్లాడుకునే దాకా దారి తీసింది. ఈ క‌బుర్ల మాటున కామంతో ర‌గిలిపోయాడు. ఇంకేముంది వివాహిత‌పై కానిస్టేబుల్ బ‌ల‌వంతంగా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

S

Telangana | Published On Oct 6, 2026, 11.17 am IST

Woman Molest | ‘ప‌ది’లో ప‌రిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగిక‌దాడి
Advertisement

Woman Molest | త్రినేత్ర న్యూస్ : ఆమెకు అత‌ను ప‌దో త‌ర‌గ‌తిలో ప‌రిచ‌య‌డం అయ్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్త రోజుకు ఒక‌ట్రెండు సార్లైనా మాట్లాడుకునే దాకా దారి తీసింది. ఈ క‌బుర్ల మాటున కామంతో ర‌గిలిపోయాడు. ఇంకేముంది వివాహిత‌పై కానిస్టేబుల్ బ‌ల‌వంతంగా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. రహ‌స్యంగా వీడియోల‌ను చిత్రీక‌రించి భ‌ర్త‌కు పంపాడు. చివ‌ర‌కు వివాహిత భ‌ర్త‌కు దూర‌మైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హ‌ర్ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తికి కొన్నేండ్ల క్రితం అంటే ప‌దో త‌ర‌గ‌తిలో ఉద‌య్ అనే యువ‌కుడు ప‌రిచ‌య‌డం అయ్యాడు. ఉద‌య్ హైద‌రాబాద్ టీజీఎస్పీ ఎనిమిదో బెటాలియ‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. యువ‌తికి మ‌రో వ్య‌క్తితో పెళ్లి కాగా, క‌రీంన‌గ‌ర్‌లో నివ‌సిస్తోంది.

సీన్ క‌ట్ చేస్తే.. ఇక పాత ప‌రిచ‌యంతో స‌ద‌రు యువ‌తితో ఉద‌య్ ఫోన్‌లో త‌రుచుగా మాట్లాడేవాడు. ఈ ఏడాది మార్చి 3న క‌రీంన‌గ‌ర్ వెళ్లిన ఉద‌య్.. ఆమెపై బ‌ల‌వంతంగా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా ర‌హ‌స్యంగా చిత్రీక‌రించాడు. ఆ వీడియోల‌ను అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఈ ఏడాది ఆగస్టు 20, 21 తేదీల్లో తన నుంచి రూ.1.30 లక్షలు తీసుకున్నాడు.

అయినా కూడా అత‌న్నుంచి బాధితురాల‌కి వేధింపులు ఆగ‌లేదు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి భ‌ర్త ముందే గొడ‌వ‌ప‌డ్డాడు. వీడియోల‌ను భ‌ర్త‌కు పంపాడు. దీంతో ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. ఈ క్ర‌మంలో బాధితురాలికి గ‌ర్భ‌స్రావం కూడా జ‌రిగింది. ఈ ఘటనపై బాధితురాలు తొలుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును కరీంనగర్‌ గ్రామీణ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కరీంనగర్‌ గ్రామీణ పోలీసులు నిందితుడు ఉదయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement