Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
Private Bus | ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) సమీపంలో పెను ప్రమాదం (road accident) తప్పింది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Bus) అదుపుతప్పి బోల్తాపడింది.
Private Bus | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Bus) అదుపుతప్పి బోల్తాపడింది (Overturn). ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోసహా 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా ఒడిశా వెళ్తున్నదని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
VIDEO | Andhra Pradesh: Private bus overturns on National Highway near Chandragiri mandal in Tirupati; 10 injured.
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/SV4GPrdKTv
— Press Trust of India (@PTI_News) November 7, 2026
టైరు పేలడంతో..
మరో ఘటనలో అలంపూర్ (Alampur) చౌరస్తాలో టైరు పేలడంతో ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. పీఆర్ఎల్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో ప్రొద్దుటూరు (Proddutur) నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. శుక్రవారం అర్ధరాత్రి అలంపూర్ చౌరస్తాకు రాగానే బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం హైదరాబాద్-కర్నూల్ మార్గంలోకి దూసుకొచ్చి.. ఫ్లైఓవర్ సైడ్ వాల్స్‌కు సమీపంలో ఆగిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు.
తాజావార్తలు
- ●Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..
- ●Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..
- ●DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్
- ●Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక
- ●Diwali 2026 Lucky Horoscope | ఈ దీపావళి ఈ 4 రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభఫలితాలు!
- ●Horoscope | నవంబర్ 7 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు!

Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..

Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..

DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్

Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక






