MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
MP Abhishek Banerjee | బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (MP Abhishek Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. గత ఆరు నెలల్లోనే తనను హత్య చేయడానికి బీజేపీ ఏడుసార్లు ప్రయత్నించిందంటూ ఆరోపించారు.
MP Abhishek Banerjee | త్రినేత్ర న్యూస్ : పశ్చిమ బెంగాల్‌లో అధికార బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (MP Abhishek Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. కోల్‌కతా (Kolkata)లోని కాళీఘాట్ (Kalighat)లో గల తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు చెప్పారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బీజేపీ మద్దతుదారులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో పలువురు టీఎంసీ కార్యకర్తలు గాయపడినట్లు చెప్పారు. గత ఆరు నెలల్లోనే తనను హత్య చేయడానికి బీజేపీ ఏడుసార్లు ప్రయత్నించిందంటూ ఆరోపించారు.
ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోని అభిషేక్ బెనర్జీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. దాడికి రెండు రోజుల ముందు వారు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. తన పేరుతో ఉన్న బ్యానర్లు, పోస్టర్లను కూడా వారు చించేసినట్లు తెలిపారు. “రెండు రోజుల పాటు నిరంతర రెక్కీ తర్వాత.. ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు బీజేపీ గూండాలు నా ఇంటిపై దాడి చేశారు. గత ఆరు నెలల్లో నా ప్రాణాలను తీయడానికి జరిగిన ఏడో ప్రయత్నం ఇది. నా ఇంటి ముందు ఇంత హింసాకాండ జరుగుతున్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడం లేదు. కొందరు బీజేపీ మద్దతుదారుల వద్ద తుపాకీలు కూడా ఉన్నాయి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది” అని అభిషేక్ చెప్పుకొచ్చారు.
గత ఆరు నెలలుగా తనపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు. ఒక పార్లమెంటు సభ్యుడినైన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అభిషేక్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఒక డ్రామాగా అభివర్ణించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు.
Also Read..
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
అక్టోబర్ 29, 2026

CM Suvendu Adhikari | సనాతన ధర్మాన్ని పాటించే వారే అమ్మవారి విగ్రహాలను తాకాలి.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
అక్టోబర్ 21, 2026

Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
- ●Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
- ●Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..
- ●Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..
- ●DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్
- ●Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక

White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా

Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..

Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..



