త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yellamma | అమ్మా త‌ల్లీ ఎల్ల‌మ్మ.. మా ఇంట్లో నుంచి న‌ల్లుల‌ను బ‌య‌ట‌కు పంపించూ.. ఓ భ‌క్తుడి విచిత్ర కోరిక‌

Yellamma | నాకు బంగారం నీకు.. నీకు వెండి ఇస్తా.., మా ఊరిని ముంగు గ్రామంగా ప్ర‌క‌టించేలా చెయ్యి.., నా పిల్ల‌ల‌కు తెలివిని ఇవ్వు.. అంటూ విచిత్ర కోరిక‌ల‌తో భ‌క్తులు పేప‌ర్ల‌లో రాసీ హుండీల్లో (Hundi) వేయ‌డం వంటివి మ‌నం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం.

G

National | Published On Nov 7, 2026, 6.14 am IST

Yellamma | అమ్మా త‌ల్లీ ఎల్ల‌మ్మ.. మా ఇంట్లో నుంచి న‌ల్లుల‌ను బ‌య‌ట‌కు పంపించూ.. ఓ భ‌క్తుడి విచిత్ర కోరిక‌
Advertisement

Yellamma | త్రినేత్ర న్యూస్‌: నాకు బంగారం నీకు.. నీకు వెండి ఇస్తా.., మా ఊరిని ముంగు గ్రామంగా ప్ర‌క‌టించేలా చెయ్యి.., నా పిల్ల‌ల‌కు తెలివిని ఇవ్వు.. అంటూ విచిత్ర కోరిక‌ల‌తో భ‌క్తులు పేప‌ర్ల‌లో రాసీ హుండీల్లో (Hundi) వేయ‌డం వంటివి మ‌నం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ భ‌క్తుడు కూడా ఇలాంటి విచిత్ర‌మైన కోరినే ఎల్ల‌మ్మ (Yellamma) త‌ల్లిని వేడుకున్నాడు. త‌మ స‌మ‌స్య‌ను తీరిస్తే ఆల‌యానికి వ‌చ్చి పండ్లు, కాయ‌లు ఇచ్చి పూజ‌లు చేసుకుంటాన‌నీ ఆ త‌ల్లిని వేడుకున్నాడు.

ఉత్తర కర్ణాటకలోని బెళ‌గావిలో (Belagavi) శక్తి దేవత సవదత్తి ఎల్లమ్మ దేవాలయంలో (Savadatti Yellamma Temple) దేవాదాయ సిబ్బంది హుండీల్లో నగదు, కానుకలు లెక్కపెడుతున్నారు. ఈ క్ర‌మంలో వారికి ఒక భక్తుడు వేసిన చీటీ (Handwritten Note) దొరికింది. సాధారణంగా తమ కష్టాలు తొలగించాలని, అప్పుల బాధ లేకుండా చేయాలని అమ్మవారి హుండీలో భక్తులు కాగితంపై రాసి, దాన్ని వేస్తుంటారు. ఈసారి ఒక భక్తుడు ‘అమ్మా తల్లీ ఎల్లమ్మ దేవీ.. మా ఇంట్లో నల్లులు (Bedbug) ఉన్నాయి. అన్ని నల్లులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చెయ్యి. మళ్లీ నీ ఆలయానికి వచ్చి పండ్లు, కాయలు ఇచ్చి పూజలు చేసుకుంటా’ అని రాసి హుండీలో వేశాడు. సిబ్బంది ఆ పేప‌ర్‌ను ఆల‌య అధికారుల‌కు అందజేశారు. ఆ భ‌క్తుడి కోరిక ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న‌ది.

 

Advertisement
Advertisement