Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ – 450 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 27 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. శోభినవ్ సత్య హీరోగా నటించిన ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించాడు. రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 400 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
Entertainment | Published On Nov 7, 2026, 12.16 pm IST
Bollywood OTT | హనుమాన్ అంశ్...చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. స్టార్లు, పేరున్న డైరెక్టర్, టెక్నీషియన్లు లేకుండా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మైథాలజీ మూవీ వరల్డ్ వైడ్‌గా 450 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. బాలీవుడ్‌లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా చరిత్రను సృష్టించింది.
సోనీలివ్ ఓటీటీలో...
థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 27 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
కరోలీ బాబా జీవితం...
ఉత్తరాదికి చెందిన ప్రముఖ అధ్యాత్మిక గురువు కరోలీ బాబా జీవితం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ సినిమాను తెరకెక్కించారు. శోభినవ్ సత్య టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాలో విహాన్ షెగ్డే, చందన్ కే ఆనంద్, పూర్ణిమ తివారీ కీలక పాత్రల్లో నటించారు.
పదమూడేళ్ల వయసులో...
రిలీజైన తొలి వారంలో హనుమాన్ అంశ్ సినిమాను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. మౌత్‌టాక్‌తో మెళ్లమెళ్లగా వసూళ్లు పెరిగాయి. కరోలీ బాబా జీవితాన్ని కమర్షియల్ ఎలిమెంట్లు లేకుండా సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు.
పదమూడేళ్ల వయసులోనే తల్లికి దూరమవుతాడు లక్ష్మీనారాయణశర్మ. చనిపోయిన తన తల్లిని తిరిగి శ్రీరాముడి ద్వారానే కలవగలనని నమ్ముతాడు. హనుమంతుడిపై భక్తిని పంచుకొని దేశం మొత్తం తిరుగుతాడు. ఈ ప్రయాణంలో అతడు తెలుసుకున్న సత్యాలేమిటి? లక్ష్మీనారాయణ ...కరోలీ బాబాగా ఎలా మారాడు అన్నది ఈ మూవీ కథ.
తెలుగులో డిజాస్టర్...
బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోకి అదే పేరుతో డబ్ చేశారు. తెలుగు వెర్షన్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranveer Singh | సినిమా షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా – వివాదంలో రణవీర్‌సింగ్ “ప్రళయ్”
నవంబర్ 6, 2026

Ramayana | రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ – ధురంధర్ 2 , టాక్సిక్ కంటే తక్కువే!
నవంబర్ 6, 2026

Ramayana | రామాయణ కంటే ప్రభాస్ ఆదిపురుష్ పది రెట్లు బెటర్ – చెత్త మూవీ – బాలీవుడ్ క్రిటిక్ పోస్ట్ వైరల్
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
- ●Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
- ●White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
- ●Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు

US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్



