త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DSSSB Recruitment | DSSSBలో జూనియ‌ర్ ఇంజినీర్‌, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌

DSSSB Recruitment | ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 1,260 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు (DSSSB Recruitment) ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Nov 7, 2026, 7.24 am IST

DSSSB Recruitment | DSSSBలో జూనియ‌ర్ ఇంజినీర్‌, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌
Advertisement

DSSSB Recruitment | త్రినేత్ర న్యూస్‌: ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 1,260 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు (DSSSB Recruitment) ఆహ్వానిస్తున్న‌ది. అర్హులైన అభ్యర్థులు న‌వంబ‌ర్ 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. డిసెంబ‌ర్ 11 వ‌ర‌కు అప్లికేష‌న్లు అందుబాటులో ఉంటాయి. విద్యాశాఖ, ట్రేడ్‌ అండ్‌ ట్యాక్సెస్‌, ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు, ఉన్నత విద్యాశాఖ, వెయిట్స్ అండ్ మెజర్స్ శాఖ, ప్రిన్సిపల్ అకౌంట్స్ కార్యాలయం, ల్యాండ్ అండ్ బిల్డింగ్ శాఖ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు, ట్రాన్స్‌కో లిమిటెడ్, ర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.18,000 నుంచి రూ.1,51,100 వ‌ర‌కు అందుకోవ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 1260

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 1,075 (జ‌న‌ర‌ల్ 439, ఓబీసీ 292, ఎస్సీ 158, ఎస్టీ 80, ఈడ‌బ్ల్యూఎస్ 106)
ఇందులో ఎంటీఎస్‌ జనరల్‌ డ్యూటీ-835, ఎంటీఎస్‌- ఆయా(మహిళలు) 239 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
జూనియర్‌ ఇంజినీర్ (JE): 185 (జ‌న‌ర‌ల్ 98, ఓబీసీ 33, ఎస్సీ 23, ఎస్టీ 14, ఈడ‌బ్ల్యూఎస్ 17)

అర్హత: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. కొన్ని శాఖల్లో డిప్లొమాతో పాటు రెండేండ్ల‌ పని అనుభవం తప్పనిసరి. ఎంటీఎస్‌ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు పోస్టుకు పదో తరగతి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ అర్హత ఉండాలి. పోస్టును బట్టి అర్హతలు, అనుభవం మారుతాయి. అభ్య‌ర్థులు 18 నుంచి 27 ఏండ్ల ఉండాలి.

ఎంపిక విధానం: జూనియర్ ఇంజినీర్‌కు రెండు దశల్లో (Tier-I, Tier-II) పరీక్ష ఉంటుంది.
టైర్‌-1లో 200 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. టైర్‌-IIలో 150 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఎంటీఎస్‌ పోస్టులకు ఒకే దశలో (One Tier) కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. 200 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు

జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20, అరిథ్‌మెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 20, హిందీ 20, ఇంగ్లిష్ నుంచి 20 చొప్పున మొత్తం 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. జూనియర్ ఇంజినీర్ పరీక్షలో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి. జూనియర్ ఇంజినీర్‌కు నెల‌కు రూ.35,400 నుంచి రూ.1,12,400, ఎంటీఎస్‌కు రూ.18,000 నుంచి రూ.56,900 వ‌ర‌కు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్‌ 12
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబ‌ర్ 11
వెబ్‌సైట్‌: dsssb.delhi.gov.in

Advertisement
Advertisement