త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

సుప్రీంకోర్టు వద్ద నిరసన కవరేజీలో రాహుల్ గాంధీ తనను చేయి పట్టి లాగి తోసేశారని, మెట్లపై పడి తీవ్ర గాయాలయ్యాయని గర్భిణి అయిన మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.

J

National | Published On Oct 13, 2026, 1.03 pm IST

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

సంక్షిప్త సారాంశం

సుప్రీంకోర్టు వద్ద నిరసన కవర్ చేస్తున్న తనను రాహుల్ గాంధీ, ఆయన భద్రతా సిబ్బంది తోసివేశారని జర్నలిస్ట్ రిచా పరాశర్ ఆరోపించారు. తాను మూడు నెలల గర్భిణినని, మెట్లపై బోర్లా పడటంతో మోకాళ్లు, చేతులు, మెడకు బలమైన గాయాలై ఆసుపత్రి పాలయ్యానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షమాపణ చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ శ్రేణులు ఆమెను అసభ్య పదజాలంతో దూషించారని బీజేపీ ఆరోపించింది.

Advertisement
  • రాహుల్ గాంధీ తోసేశారా?
  • సుప్రీంకోర్టు వద్ద గర్భిణి జర్నలిస్ట్‌పై రాహుల్ గాంధీ దాష్టీకం?
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రికి రిపోర్టర్
  • బీజేపీ ఆగ్రహం

Richa Parashar | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. సుప్రీంకోర్టు ఆవరణలో నిరసన కవరేజీ చేస్తున్న ముగ్గురు నెలల గర్భిణి అయిన మహిళా జర్నలిస్ట్‌ను రాహుల్ గాంధీ దురుసుగా పక్కకు నెట్టివేశారని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనలో మెట్లపై పడి గాయపడ్డ సదరు రిపోర్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, బాధితురాలి వాంగ్మూలం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలేం జరిగింది? బాధితురాలు ఏమన్నారు?

బాధిత జర్నలిస్ట్ రిచా పరాశర్ ఆసుపత్రి బెడ్‌పై నుంచే మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

"నేను నిరసన గుంపులో కూడా లేను. సుప్రీంకోర్టు గేట్ వద్ద పొజిషన్ తీసుకుని రాహుల్ గాంధీ బైట్ తీసుకోవడానికి నిలబడ్డాను. మొదట మైక్ తీయమంటే తీసేశాను. మిగతా జర్నలిస్టులు మైకులు పెట్టడం చూసి, నా విధుల ప్రకారం మళ్లీ మైక్ ముందుకు పెట్టాను. అంతే, రాహుల్ గాంధీ కోపంతో నా చేతిని పట్టుకుని బలంగా ముందుకు లాగారు. వెంటనే ఆయన బాడీగార్డులు నన్ను తోసేశారు. దాంతో సుప్రీంకోర్టు మెట్లపై బోర్లా పడిపోయాను. నా వెనుకే ఉన్న కెమెరాపర్సన్‌ను కూడా రాహుల్ గాంధీ నెట్టేయడంతో అతనూ నా పైనే పడ్డాడు."

తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నానని, ఈ తోపులాటలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మెట్లపై పడటంతో చేతులు, కాళ్లు, మెడ తీవ్రంగా నొప్పెడుతున్నాయని, ఫోన్ పూర్తిగా పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కనికరం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు తనను దూషించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

రాహుల్ గాంధీ గూండాలా ప్రవర్తించారు: బీజేపీ ధ్వజం

ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "స్మాష్ ది పాట్రియార్కీ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ గాంధీ అసలు నైజం ఇదీ. మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా మహిళా జర్నలిస్ట్‌ను చేతులు పట్టి లాగి కింద పడేశారు" అని ధ్వజమెత్తారు. గతంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తోసేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ, రాహుల్‌కు మహిళలన్నా, ప్రజాస్వామ్యమన్నా కనీస గౌరవం లేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ ప్రచారం చేసే 'లడ్కీ హూన్, లడ్ సక్తీ హూన్' నినాదం డొల్లతనం ఈ ఘటనతో బట్టబయలైందని మండిపడ్డారు.

ఇదీ చదవండి | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..

దిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజేష్ భాటియా బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరసనల్లో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం దారుణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement