Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..
Cockroach Janta Party | న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్రోచ్ జంతా పార్టీ (సీజేపీ) చీఫ్ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకాలను మంగళవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ ఉటంకించిన వర్గాలు వెల్లడించాయి.
Cockroach Janta Party | న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్రోచ్ జంతా పార్టీ (సీజేపీ) చీఫ్ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకాలను మంగళవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ ఉటంకించిన వర్గాలు వెల్లడించాయి. జంతర్ మంతర్‌ను తిరిగి సాధించామని, తాము జంతర్ మంతర్‌లోకి ప్రవేశించామని, ఇప్పుడు తమను అదుపులోకి తీసుకుంటున్నారని సౌరవ్ దాస్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఇది యువతరానికి ఒక సందేశమని, ఏదైనా సాధించగలమని, జ్ఞానేశ్వర్ పని అయిపోయిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.
జాతీయ జెండాలు పట్టుకున్న తమ పార్టీ సభ్యులు జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారని, అనంతరం ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని దీప్కే పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నిరసనలను నిషేధించలేదని దీప్కే తన పోస్టులో వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి నిరసనలపై అభిజీత్ దీప్కే పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌ను నిరసనలకు అధికారికంగా అనుమతించిన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళనకు నిదర్శనమని ఆరోపించారు. జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశంగా గుర్తించకపోతే ఆందోళనలు ఆగిపోతాయని మోదీ భావిస్తున్నారని, అయితే అది జరగదని అన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జంతర్ మంతర్ తరహా నిరసన వేదికలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
మరోవైపు, ఆశుతోష్ రంకా తన సామాజిక మాధ్యమ పోస్టులో జంతర్ మంతర్ జోలికి రావద్దని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు సోమవారం జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం.. నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారికంగా గుర్తించిన వేదికల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు. దానికి ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను నిరసన వేదికలుగా గుర్తించారు. రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను కొత్త నిరసన వేదికలుగా ప్రకటించారు. పౌరులు తమ నిరసనలను, ప్రదర్శనలను నిర్వహించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగించినట్లు ఢిల్లీ పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jantar Mantar Protest Site Denotified | జంతర్ మంతర్ వద్ద ఇక ధర్నాలు బంద్: నిరసనలకు 3 కొత్త వేదికలను ఖరారు చేసిన ఢిల్లీ పోలీసులు
అక్టోబర్ 12, 2026

Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు
అక్టోబర్ 11, 2026

Jantar Mantar Protest Site | నిరసనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్ మంతర్ కాలం చెల్లిందా?
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
- ●Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..

MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే

Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు



