Raghav Chadha | ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్ధా తొలగింపు.. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వొద్దంటూ లేఖ
Raghav Chadha | ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో గొంతెత్తుతున్న ఎంపీ (AAP MP) రాఘవ్‌చద్ధా (Raghav Chadha)కు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ (Rajya Sabha deputy leader) పదవి నుంచి చద్ధాను తొలగించింది.
Raghav Chadha | ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో గొంతెత్తుతున్న ఎంపీ (AAP MP) రాఘవ్‌చద్ధా (Raghav Chadha)కు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ (Rajya Sabha deputy leader) పదవి నుంచి చద్ధాను తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్ (Punjab MP Ashok Mittal)ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. అంతేకాదు, సభలో చద్ధాకు మాట్లాడేందుకు సమయం ఇవ్వొద్దని కోరింది.
ఆప్ నిర్ణయంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వదంతులు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పార్టీకి, ఎంపీ రాఘవ్ చద్ధాకు మధ్య విభేధాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ వదంతులను అశోక్ మిట్టల్ కొట్టిపారేశారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, పార్టీ వ్యవహారాల విషయంలో రాఘవ్ చద్ధా ఎప్పుడూ దూరంగానే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఆప్, పార్టీ అగ్ర నాయకత్వానికి సబంధించిన కీలక పరిణామాలపై ఆయన మౌనం వహిస్తుండటం కూడా పార్టీ అధిష్ఠానానికి నచ్చడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా తాజా పరిణామాలపై చద్ధా స్పందించలేదు. అయితే, అప్పుడు కంటి ఆపరేషన్ కారణంగా యూకేలో ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతరులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా చద్ధా బహిరంగంగా స్పందించలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టూ చేయలేదు. దీంతో ఎంపీ వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read..
న్యాయమూర్తి నోట Floccinaucinihilipilification పదం.. అసలు దీని అర్థమేంటి..?
ఐఫోన్లతో చంద్రుడి వద్దకు వెళ్లిన వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారి
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






