త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | రాష్ట్ర‌ప‌తిని క‌లువ‌నున్న రాఘ‌వ్ చ‌ద్దా.. పంజాబ్ ఆప్ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేసేందుకే..!

Raghav Chadha | ఇటీవ‌ల బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా పంజాబ్ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తిని క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. మే 5న ఉద‌యం 10.40 గంట‌ల‌కు ప్రెసిడెంట్ స‌మ‌యం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

P

National | Published On May 3, 2026, 4.02 pm IST

Raghav Chadha | రాష్ట్ర‌ప‌తిని క‌లువ‌నున్న రాఘ‌వ్ చ‌ద్దా.. పంజాబ్ ఆప్ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేసేందుకే..!
Advertisement

Raghav Chadha | ఇటీవ‌ల బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా పంజాబ్ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తిని క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. మే 5న ఉద‌యం 10.40 గంట‌ల‌కు ప్రెసిడెంట్ స‌మ‌యం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రతీకారానికి ఉపయోగిస్తున్నారని, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల‌ను టార్గెట్ చేస్తున్న‌ట్లుగా చ‌ద్దా ఆరోపించారు. ఈ విషయాన్ని చ‌ద్దాతో పాటు ప‌లువురు ఎంపీలు రాష్ట్రపతికి దృష్టికి దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు.

ఆప్ ప్ర‌భుత్వంలో..

వాస్త‌వానికి రాఘ‌వ్ చ‌ద్దా ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి, ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌కు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు పొందారు. లోక్‌పాల్ ఉద్య‌మంలో కేజ్రీవాల్‌తో క‌లిసి ప‌ని చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలోనే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. 2015లో పార్టీ నేష‌న‌ల్ ట్రెజ‌ర‌ర్‌గా నియాక‌మ‌య్యారు. 2019లో దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం పంజాబ్‌లో పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 2022 మార్చి 21న రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పంజాబ్ నుంచి యువ స‌భ్యుడిగా రాజ్య‌స‌భ‌కు వెళ్లిన ఎంపీగా ఘ‌న‌త సాధించారు. అంతకుముందు ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగాను ప‌ని చేశారు.

కేజ్రీవాల్‌కు దూరం దూరం..

ఇటీవలి కాలంలో కేజ్రీవాల్-రాఘవ్ చద్దా మధ్య దూరం పెరిగింది. కేజ్రీవాల్ జైలులో ఉన్న స‌మ‌యంలో చ‌ద్దా త‌న స‌తీమ‌ణి ప‌రిణితీ చోప్రాతో క‌లిసి లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సోష‌ల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయనను పంజాబ్ రాజకీయాల నుంచి దూరంగా ఉంచినట్లు సమాచారం. శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ, పార్టీ కీలక అంశాలపై కొంతకాలంగా మౌనం వ‌హిస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల ఆయ‌న ప‌లువురు ఎంపీల‌తో క‌లిసి బీజేపీలో చేరారు. అయితే, పార్టీ నిర్ణ‌యాల‌పై నేరుగా స్పందించ‌క‌పోయినా సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న మౌనాన్ని ఓట‌మిగా భావించొద్ద‌ని, తాను ఒక న‌దిలాంటివాడిన‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌వాహంలో మారుతాన‌ని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement