త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamatha Banerjee | న్యాయ‌వాదుల ఘ‌ట‌న‌ బాధ్యులెవ‌రో నాకు తెలియ‌దు: మ‌మ‌త

Mamatha Banerjee | ఎస్ఐఆర్ (SIR) ప్ర‌క్రియ జ‌రుగుతున్న వేళ‌ పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో ఏడుగురు జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తాజాగా స్పందించారు. ప్ర‌స్తుతం ప‌రిపాల‌న నా చేతుల్లో లేద‌ని.. దీనికి బాధ్యులెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు.

S

News | Published On Apr 2, 2026, 3.30 pm IST

Mamatha Banerjee | న్యాయ‌వాదుల ఘ‌ట‌న‌ బాధ్యులెవ‌రో నాకు తెలియ‌దు: మ‌మ‌త
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఎస్ఐఆర్ (SIR) ప్ర‌క్రియ జ‌రుగుతున్న వేళ‌ పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో ఏడుగురు జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తాజాగా స్పందించారు. ప్ర‌స్తుతం ప‌రిపాల‌న నా చేతుల్లో లేద‌ని.. దీనికి బాధ్యులెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. అధికారుల నిర్బంధం విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

భాజపా కుట్రలో భాగమే..

ఈ నేప‌థ్యంలో గురువారం సాగర్‌దిఘిలో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో మమత మాట్లాడారు. ‘న్యాయ‌వాదుల ఘ‌ట‌న‌కు బాధ్యులువ‌రో నాకు తెలియదు. నాకు ఎవరూ సమాచారం అందించ‌లేదు. శాంతి భద్రతలను ఎన్నికల సంఘం చూసుకుంటోంది. వారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట వింటున్నారు అని మ‌మ‌త వ్యాఖ్యానించారు. ఇక్కడ‌ అధికారులందరినీ మార్చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సర్వేపై ప్రజలు కోపంగా ఉన్నారని వివ‌రించారు. మాల్దాలో జరిగిన ఘటన భాజపా (BJP) కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భాజ‌పా భావిస్తుందని విమ‌ర్శించారు. ఎందుకంటే వారికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేశారు. న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో ఎన్నిక‌ల సంఘం విఫలమైంద‌ని మండిప‌డ్డారు.

కాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం అనుమతి ఇచ్చింది. ఎస్​ఐఆర్​ ప్రక్రియ స‌జావుగా సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఇందుకు కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఇదిలా ఉండగా ఈనెల 23, 29 తేదీల్లో రెండు దశల్లో బెంగాల్ లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 4న ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement
Advertisement